ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AI: కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారా.. మీ జాబులు ఊడినట్టే

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:13 AM

ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్‌లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. టెక్ రంగంలో టాక్ ఆఫ్ ది టౌన్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో పనుల్ని టక్కున చేసి పెట్టే ఏఐ టెక్నాలజీ ప్రస్తుతం ఉద్యోగాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. భవిష్యత్తులో ఏఐ అనేక రంగాల్లోని ఉద్యోగాలను ఊస్ట్ చేయగలదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులైతే తట్టాబుట్టా సర్దేయాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.

ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్‌లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని IT రంగంలో కాల్ సెంటర్‌లు కీలకంగా ఉన్నాయి. ఈ రంగం సంవత్సరాలుగా మిలియన్ల మందికి ఉద్యోగాలను అందిస్తోంది.


ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు టెలికాలర్స్‌గా మారిపోవచ్చు. కాల్ సెంటర్ ఉద్యోగులు కస్టమర్ల సమస్యలను విని.. సమాధానాన్ని కస్టమర్లు కోరిన భాషలో ఇస్తుంటారు. ఇప్పుడు వారి స్థానాన్నే ఏఐ ఆక్రమించబోతోందట.

ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి.. కస్టమర్లకు తగిన సమాచారాన్ని వేగంగా, కచ్చితంగా ఇవ్వడంలో ఏఐ భవిష్యత్తులో కీలకంగా వ్యవహరిస్తుందని కృతివాసన్ అన్నారు.


ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీలు..

కొన్ని రోజులుగా చాలా ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ వంటి బడా కంపెనీలైతే ఇప్పటికే ఉద్యోగులు లేకుండా ఏఐ టెక్నాలజీ సాయంతో పని చేయించుకోవడం ప్రారంభించాయి.

Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

అయితే కృతివాసన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో టెక్కీలకు డిమాండ్ తగ్గడం కంటే పెరుగుతుందని.. వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని అన్నారు. ఏఐ రంగంలో కూడా టెక్కీలు శిక్షణ పొందుతూ.. తమను తాము ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 11:14 AM

Advertising
Advertising