ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. వీరికి మరింత లాభం..

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:42 PM

గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Google ad Services

గూగుల్ (Google) ఎప్పటికప్పుడు యూజర్లు, వ్యాపారస్తుల కోసం అప్‌డేట్లను మారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈసారి Google తన ప్రకటనల విధానంలో కొన్ని మార్పులు చేసింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు మేలు జరగనుంది. ఈ మార్పుల ద్వారా చిన్న వ్యాపారస్తులు వారి ప్రకటనలను సులభతరం చేసుకోనున్నారు. ఇది మిలియన్ల కొద్దీ చిన్న వ్యాపారాలను ప్రభావితం చేస్తుందని తెలిపింది. నవంబర్ 21 నుంచి ధృవీకరించబడిన గూగుల్ వ్యాపార ప్రొఫైల్‌ కలిగిన వారు మాత్రమే వ్యాపారాలు ప్రకటనలను చేసుకుంటారని Google స్పష్టం చేసింది.


ప్రొఫైల్ తప్పనిసరి

దీంతో యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని వ్యాపారాలు ప్రభావితం కావచ్చని గూగుల్ ఆన్‌లైన్ పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే యూఎస్, కెనడాలోని ఎంపిక చేసిన వ్యాపారాలకు ఇది అమలు చేసినట్లు చెప్పింది. ఈ మార్పు ద్వారా వ్యాపారాల మోసాన్ని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నమని గూగుల్ చెబుతోంది. వారి ప్రొఫైల్ సరిగా లేకపోతే యాడ్స్ ప్రకటనలు నిలిపివేస్తామని వెల్లడించింది. Google విధానంలో మార్పు గురించి అవగాహన లేని చిన్న వ్యాపారాలు తెలుసుకోవాలని సూచించింది. గూగుల్ ప్రకారం చిన్న వ్యాపారం ప్రొఫైల్ పేరు, చిరునామా ప్రకటన సమాచారంతో సరిపోలకపోతే, అప్పుడు ఆ ప్రకటన నిలిపివేయబడుతుంది.


ధృవీకరణకు ఎంత సమయం

Googleలో వ్యాపారాన్ని ధృవీకరించడం కష్టం కానప్పటికీ, దీనికి కొంత సమయం పడుతుంది. వ్యాపార యజమానులు తప్పనిసరిగా Googleలో వారి వ్యాపార చిరునామాను సరిగ్గా టైప్ చేసి, అది సరైనదని క్లెయిమ్ చేయాలి. యజమానులు తప్పనిసరిగా ఫోన్, ఇమెయిల్ లేదా వీడియో ద్వారా చిరునామాను ధృవీకరించాలి. వ్యాపార వర్గం, స్థానం ఆధారంగా ఈ ప్రక్రియ మారుతుంది. వ్యాపార నేపథ్యం, నమోదు, బీమా, లైసెన్సింగ్ తనిఖీల గురించి సమాచారాన్ని అందించడం వంటివి ఉండవచ్చు. Google ధృవీకరణకు ఏడు రోజుల వరకు సమయం పట్టవచ్చు. వ్యాపారం ధృవీకరించబడిన తర్వాత దాని యజమానికి తెలియజేయబడుతుంది.


గూగుల్ యాడ్స్ ఎందుకు..?

Google ప్రకటనలు అనేది మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించడానికి, అవగాహన కల్పించడానికి, మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్‌ను పెంచడానికి ఉపయోగించుకునే ఉత్పత్తి. Google ప్రకటనల ఖాతాలు ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మీ ప్రకటన సెట్టింగ్‌లు, బడ్జెట్‌తో సహా మీ ప్రకటన ప్రచారాన్ని ఏ సమయంలోనైనా సృష్టించుకోవడానికి, మార్చుకోవడానికి మీకు సౌలభ్యం ఉంటుంది. ఈ ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మీకు నచ్చినంత బడ్జెట్‌ను సెట్ చేసి నియంత్రించుకోవచ్చు. అయితే ఈ మార్పులు ఇండియాలో ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...


WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 30 , 2024 | 12:44 PM