ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?

ABN, Publish Date - May 16 , 2024 | 09:31 PM

ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. ఆ తరువాత అతని నంబర్‌తో మీకు పని ఉండకపోవచ్చు. నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్‌లు పంపడం ఎలా అనేది చాలా మందికి తెలియదు.

ఉదాహరణకు మీరో ఫొటో స్టూడియోకి వెళ్లారనుకోండి.. అక్కడ మీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కోసం సదరు ఫొటో స్టూడియో యజమాని నంబర్‌ని తీసుకుంటారు. అనంతరం సేవ్ చేసుకుని ఫొటోని వాట్సప్ చేస్తారు. తరువాత ఆ నంబర్‌తో మనకు పని ఉండకపోవచ్చు. గతంలో నంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సప్ చాట్ చేయగలిగే వాళ్లం. కానీ, వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య తీరిపోయింది. దీని గురించి సింపుల్‌గా తెలుసుకుందాం.


  • వాట్సప్‌ని ఓపెన్ చేయండి

  • ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

  • నంబర్‌ని కాపీ చేయండి. అనంతరం సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని పేస్ట్ చేయండి.

  • ఆ నంబర్‌పై వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని నంబర్ సేవ్ చేసుకోకుండానే షేర్ చేయొచ్చు.

ఇది కూడా చదవండి:

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Smartwatch: 87 డిస్కౌంట్‌తో ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చుశారా

Read Latest Technology News and Telugu News

Updated Date - May 16 , 2024 | 09:31 PM

Advertising
Advertising