ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

OnePlus : ‘గ్రీన్ లైన్’ సమస్యపై కీలక ప్రకటన విడుదల చేసిన వన్‌ప్లస్

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:11 PM

డిస్‌ప్లేపై గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్లకు వన్‌ప్లస్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని, ఎలాంటి ధర లేకుండా డిస్‌ప్లేను మార్చుతారని కంపెనీ ప్రకటించింది. వారంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు ఈ ప్రకటన వర్తిస్తుందని తెలిపింది.

OnePlus

డిస్‌ప్లేపై ‘గ్రీన్ లైన్’ సమస్య ఎదుర్కొంటున్న వన్‌ఫ్లస్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. వివిధ మోడళ్ల ఫోన్ల పనితీరుపై ప్రభావం చూపుతున్న ఈ సమస్యపై కంపెనీ వన్‌ప్లస్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ప్రభావిత ఫోన్లకు జీవితకాల డిస్‌ప్లే వారంటీని అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. డిస్‌ప్లే సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్లు సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని, ఎలాంటి ఛార్జి లేకుండా డిస్‌ప్లేను మార్చుతామని కంపెనీ ప్రకటించింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు ఈ ప్రకటన వర్తిస్తుందని తెలిపింది.


కాగా వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులకు ఈ సమస్య ఎదురవుతోంది. ‘గ్రీన్ లైన్’ సమస్యను ఎదుర్కొంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఫిర్యాదులు చేశారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఈ సమస్య ప్రభావితం చేస్తున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత డిస్‌ప్లేపై సన్నని ఆకుపచ్చ గీత కనిపిస్తోందని యూజర్లు చెబుతున్నారు. అయితే ఈ సమస్య వన్‌ప్లస్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాలేదు. సామ్‌సంగ్, మోటరోలా, వివో వంటి స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది.


మరోవైపు.. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 10 సిరీస్ ఫోన్లలో మదర్‌బోర్డ్‌ సమస్యలు కూడా తలెత్తుతున్నట్టు ఈ మధ్య కథనాలు వెలువడ్డాయి. మదర్‌బోర్డు సమస్యల పరిష్కారంపై కంపెనీ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మదర్‌బోర్డుకు సంబంధించిన రిపేర్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడంపై వన్‌ప్లస్ కంపెనీ దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమస్య పరిష్కారం విషయంలో యూజర్ల ఫీడ్‌బ్యాక్ కంపెనీ ఆలోచనలకు విరుద్ధంగా ఉంది.


ఒకపక్క వన్‌ప్లస్ ఫోన్ల సమస్యలపై పరిష్కారాన్ని వెతుకుతూనే.. మరోపక్క కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావడంపై వన్‌ప్లస్ కంపెనీ దృష్టిసారించింది. కస్టమర్లు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 31న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.

Updated Date - Oct 21 , 2024 | 09:13 PM