ChatGPT: ఓపెన్‌ఏఐ మరో సంచలనం.. చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజెన్ విడుదల!
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:47 AM
జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ మరో సంచలనానికి తెరతీసింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్‌ఇంజెన్‌ను గురువారం ప్రారంభించింది. చాట్‌జీపీటీలో భాగంగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ మరో సంచలనానికి తెరతీసింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్‌ఇంజెన్‌ను గురువారం ప్రారంభించింది. చాట్‌జీపీటీలో భాగంగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇకపై యూజర్లకు తమ ప్రశ్నలకు తక్షణ సమాధానాలతో పాటు ఇందకు సంబంధించి వెబ్ లింక్స్ కూడా అందుబాటులోకి వస్తాయని ఓపెన్ ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది (ChatGPT Search Engine).
Back Covers: స్మార్ట్ ఫోన్ వాడతారా? ఈ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు!
ఈ ఫీచర్ ద్వారా చాట్‌జీపీటీ.. యూజర్లకు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పపుడు ఆన్‌లైన్‌లో వెతికి వారి ముందుంచనుంది. ఈ వెబ్ లింక్స్ చాట్‌జీపీటీలోని మరో ట్యాబ్‌లో ఓపెన్ అయ్యేలా ఈ ఫీచర్‌ను సిద్ధం చేశారు. ఈ లింక్స్ ద్వారా వార్తలతో పాటు తమతో ఎగ్రిమెంట్ కుదుర్చుకున్న వారి కంటెంట్ కూడా అందిస్తామని ఓపెన్ ఏఐ పేర్కొంది. తాజా ఇంటర్‌ఫేస్‌లోని ఈ ఫీచర్ తాలూకు ఫలితాలు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పోలి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటికి అడ్వర్‌టైజ్‌మెంట్ల బెడద లేనట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం సెర్చ్ఇంజెన్ ఫీచర్ డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఫ్రీ వర్షెన్ యూజర్లూ దీన్ని వాడుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
అయితే, జనరేటివ్ ఏఐ సామర్థ్యాలతో కూడిన సెర్చ్‌ఇంజెన్ పర్‌ప్లెక్సిటీ ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మరోవైపు మైక్రోసాఫ్ట్.. కోపైలట్ చాట్‌బాట్‌ను తన ఎడ్జ్ బ్రౌజర్, విండోస్ ఆపరేటింగ్ సింస్టమ్‌లో బాగంగా అందిస్తోంది. ఇక గూగుల్ తన సెర్ఛ్ ఫలితాలకు ఏఐ ఫీచర్‌ను జోడించింది.
Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. వీరికి మరింత లాభం..
ఇదిలా ఉంటే, చాట్‌జీపటీ, పర్‌ఫ్లెక్సిటీ ఇప్పటికే పబ్లిషర్ల నుంచి కేసులు ఎదుర్కొంటున్నాయి. కాపీరైటెడ్ కంటెంట్‌ను తన అనుమతి లేకుండా యూజర్లకు అందిస్తున్నారంటూ రెండు సంస్థలపై న్యూయార్క్ టైమ్స్ కోర్టును ఆశ్రయించింది.
సెర్చ్ ఇంజెన్ ఫీచర్‌తో చాట్‌జీపీటీ పాప్యులారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత డాటా ఆధారంగా యూజర్ల ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలను ఇచ్చేదన్న ఫిర్యాదు ఎప్పటి నుంచో ఉంది. తాజాగా పీచర్‌తో ఓపెన్‌ఐకి ఉన్న ఈ సమస్య తొలగిపోయి మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు గట్టిపోటీ ఇవ్వగలదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
For More Technology News and Telugu News
Updated Date - Nov 01 , 2024 | 11:57 AM