ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:55 PM

మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌కు లీడ్‌గా నియమించారు.

మైక్రోసాఫ్ట్(Microsoft) సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్(google) సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని(Pawan Davuluri) మైక్రోసాఫ్ట్ విండోస్(Microsoft Windows) టీమ్‌కు లీడ్‌గా నియమించారు. అంతకుముందు ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ టీమ్‌లను విలీనం చేసి బుధవారం పవన్ దావులూరిని వీటి అభివృద్ధికి నాయకత్వం వహించడానికి ఎంపికచేశారు.

గతంలో మైక్రోసాఫ్ట్ హార్డ్‌వేర్ సంబంధిత పనులను చూసుకున్న పవన్ దావులూరి(Pawan Davuluri) విండోస్ ఇంజినీరింగ్‌కు కూడా నాయకత్వం వహిస్తారు. గత సెప్టెంబరులో మాజీ విండోస్, సర్ఫేస్ చీఫ్ పనోస్ పనాయ్ నిష్క్రమణ తర్వాత ఈ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అతని స్థానంలో దావులూరి వచ్చారు. విండోస్, సర్ఫేస్ టీమ్‌ల పునరేకీకరణ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్, పరికరాల సంస్థలో మరికొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన వార్తలను ట్రాక్ చేసే విండోస్ సెంట్రల్ అనే వార్తా సైట్ ఈ సమాచారాన్ని అందించింది.


పవన్ దావులూరి 2001లో మైక్రోసాఫ్ట్‌లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆయన ఐఐటీ మద్రాస్(IIT Madras) నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత 1999లో యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. దావులూరి 23 సంవత్సరాలుగా Microsoftలో వివిధ నాయకత్వ పదవులను నిర్వహించారు. PC, Xbox హార్డ్‌వేర్, సర్ఫేస్, Windowsలో పని చేశారు. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా దావులూరి విండోస్ సిలికాన్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌ను పర్యవేక్షించారు. కొత్త పాత్రలో దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ ఉత్పత్తుల కోసం సిలికాన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసే బృందానికి నాయకత్వం వహిస్తారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank Holidays: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే

Updated Date - Mar 27 , 2024 | 12:57 PM

Advertising
Advertising