ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Smartphone: రూ.7 వేలకే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్.. 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా..

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:54 AM

తక్కువ రేటులో మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అలాంటి వినియోగదారుల కోసం Samsung సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ చుద్దాం.

samsung galaxy f05

మీరు తక్కువ ధరల్లో మంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్(Smartphone) కోసం ఎదురు చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అలాంటి వినియోగదారుల కోసం Samsung సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఫీచర్లు

Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్ 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G85 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 2GHz Cortex-A75, 1.8GHz Cortex A55 CPUలతో వస్తుండగా, గ్రాఫిక్స్ కోసం ARM Mali G52 GPUని కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో Galaxy F05 50MP ప్రైమరీ కెమెరా, వెనుక 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉండగా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది.


మల్టీ టాస్కింగ్

ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI కోర్ 6.0తో పని చేస్తుంది. కంపెనీ 2 జనరేషన్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.3, USB టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన పనితీరు, వేగవంతమైన మల్టీ టాస్కింగ్, యాప్ నావిగేషన్ కోసం MediaTek Helio G85 ప్రాసెసర్ Samsung Galaxy F05లో ఇన్‌స్టాల్ చేయబడింది.


ధర ఎంత

ఇది RAM ప్లస్ ఫీచర్‌తో 8GB వరకు RAMని కలిగి ఉంది. ఈ ర్యామ్ ప్లస్ సాంకేతికత వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వర్చువల్ ర్యామ్‌ను యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఇది 64 GB స్టోరేజ్ సపోర్టుతోపాటు మరింత పెంచుకోవడానికి 1TB వరకు అందుబాటులో ఉంది. Samsung Galaxy F05 సింగిల్ ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేయబడింది. 4GB + 64GB మోడల్ ధర రూ.7999. ఈ Samsung స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 20 నుంచి Samsung.Com, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త పరికరం Samsung Galaxy F05 లెదర్ నమూనా డిజైన్‌ను కలిగి ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Pagers: పేజర్లతో పేలుడు విధ్వంసం.. పేజర్ అంటే ఏంటి, వీటి వాడకం ఎక్కడ


Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

For More Technology News and Telugu News..

Updated Date - Sep 18 , 2024 | 09:57 AM

Advertising
Advertising