ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Realme C65G: బడ్జెట్ ధరతో సరికొత్త ‘రియల్‌మీ సీ65’ స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN, Publish Date - Apr 26 , 2024 | 03:21 PM

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. రియల్‌మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్‌, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ తయారయ్యిందని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. రియల్‌మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్‌, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ తయారయ్యిందని కంపెనీ తెలిపింది. నీళ్లు, ధుమ్ము నిరోధించేలా ఐపీ54 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ వివరించింది.


రియల్‌మీ సీ65 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్+ 6జీబీ ఇంటర్నల్ స్టోరేజీలో అందుబాటులో ఉన్న వేరియెంట్ ధర రూ. రూ.10,499గా ఉంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499గా, 6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,499గా ఉన్నాయి. ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్‌ వేరియెంట్లలో లభ్యమవుతోంది. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కామ్‌లపై అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. స్టోర్‌లలో కూడా అమ్మకాలు ప్రారంభమవుతాయి. సేల్ ఆఫర్‌లో భాగంగా రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లపై రూ.1000 వరకు తగ్గింపును కస్టమర్లు పొందవొచ్చని కంపెనీ తెలిపింది.


రియల్‌మీ సీ65 5జీ స్మార్ట్‌ఫోన్ ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే 6.67-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ఫీచర్లను కలిగివుంది. కాగా రియల్‌మీ సీ65లో డుయెల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌లతో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా వచ్చింది. ఇక ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పనిచేస్తుంది. కాగా రియల్‌మీ కంపెనీ ఈ వారమే భారత్‌లో నూతన రియల్‌మీ నర్జో 70 5జీ, రియల్‌మీ నర్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

X TV App: ఎలాన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కి పోటీగా ‘ఎక్స్ టీవీ యాప్’

AI: కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారా.. మీ జాబులు ఊడినట్టే

Read Latest Tech News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 03:24 PM

Advertising
Advertising