చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:27 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీ డలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళి క సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి అన్నా రు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీ డలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళి క సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాం గణంలో డిసెంబర్ 17 నుంచి 19 వరకు నిర్వహి ంచిన ముఖ్యమంత్రి కప్ క్రీడల ముగింపు కార్య క్రమానికి గురువారం సాయంత్రం ఆయన కలె క్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడారు. ప్రతీ విద్యార్థి చదు వుతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వా లని అప్పుడే జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారని తెలిపారు. ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి స్వయంగా ఫుట్‌బాల్ క్రీడాకారుడినని, వనపర్తిలోనే విద్యాభ్యాసాలు పూర్తి చేసి ఇక్కడే ఇదే మైదానంలో ఆటలు ఆడుకున్నారని గుర్తు చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ... సీఎం కప్‌కు నెల రోజుల నుంచి సన్నాహకాలు చేసి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నేడు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 36 క్రీడా విభాగాల్లో క్రీడలు నిర్వహించగా 3600 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడ జి ల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబ రు 27 నుంచి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం క్రీడల్లో మొదటి, రెండవ, తృతీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, కప్‌లు బహూకరించారు. జిల్లా యువజ న క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, జిపి కిరణ్, సీతా రాం, క్రీడాకారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 19 , 2024 | 11:27 PM