WhatsApp: గ్రీన్ కలర్‌లో వాట్సాప్.. దీని వెనుక అసలు కారణం ఏంటి?
ABN, Publish Date - Apr 27 , 2024 | 06:11 PM
తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ప్రతీదీ రీఫ్రెషింగ్‌గా అనిపించేలా ఉండటం కోసం.. ‘మెటా’ (Meta) సంస్థ వాట్సాప్‌లో (WhatsApp) రకరకాల అప్డేట్స్, వినూత్నమైన మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా...
తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ప్రతీదీ రీఫ్రెషింగ్‌గా అనిపించేలా ఉండటం కోసం.. ‘మెటా’ (Meta) సంస్థ వాట్సాప్‌లో (WhatsApp) రకరకాల అప్డేట్స్, వినూత్నమైన మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా దీని థీమ్ కలర్ మారిపోయింది. ఇంతకుముందు ‘నీలం’ రంగులో ఉండే థీమ్.. ఇప్పుడు గ్రీన్ కలర్‌లోకి మారింది. భారతీయులు సైతం ఈ మార్పుని తమ వాట్సాప్‌లో గమనించవచ్చు. అయితే.. దీనిపై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో ఈ కొత్త మార్పు బాగుందని చెప్తుంటే.. మరికొందరేమో ఈ ‘పచ్చ’ రంగు అతకలేదని అభిప్రాయపడుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..
ఈ మార్పు వెనుక కారణం ఏంటి?
తమ యాప్ వినియోగం మరింత సౌలభ్యంగా ఉండటంతో పాటు యూజర్లకు సరికొత్త అనుభవం ఇవ్వడం కోసమే తాము థీమ్ కలర్‌ని ‘గ్రీన్’గా మార్చినట్టు మెటా సంస్థ పేర్కొంది. అదొక్కటే కాదు.. లుక్ కూడా కాస్త మార్చామని, స్పేసింగ్‌తో పాటు ఐకాన్స్‌లోనూ కొద్దిపాటు మార్పులు చేయడం జరిగిందని ఆ కంపెనీ వెల్లడించింది. స్టేటస్ బార్ దగ్గర నుంచి చాట్-లిస్ట్ విండో దాకా.. డిజైన్ పరంగా ప్రతీది మారింది. యాప్‌లో షేర్ చేయబడే లింక్స్ సైతం.. ఇప్పుడు నీలం రంగులో కాకుండా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. డార్క్ మోడ్ అయితే మరింత ముదురు రంగులోకి మారడాన్ని గమనించవచ్చు.
బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని ఆ పని చేసింది.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!
ఇతర మార్పులు ఏంటి?
ఇంతకుముందు యూజర్లు ఆన్‌లైన్‌లో (online) ఉన్నా, ఏదైనా సందేశం టైప్ (typing) చేసినా.. ఆంగ్లంలో అక్షరాలన్నీ స్మాల్ సైజ్‌లోనే కనిపించేవి. కానీ.. కొత్త మార్పుల్లో భాగంగా ఆ రెండు పదాల ముందు అక్షరాలను క్యాపిటలైజ్డ్ చేశారు. అంటే.. ‘online’ని ‘Online’గా, ‘typing’ని ‘Typing’గా మార్చడం జరిగింది. తమ యూజర్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ మార్పులు చేసినట్లు మెటా సంస్థ వివరణ ఇచ్చింది. మరి.. ఈ మార్పులను మీరు గమనించారా?
Read Latest Technology News And Telugu News
Updated Date - Apr 27 , 2024 | 06:11 PM