Whatsup: వాట్సప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. పర్సనల్ చాట్‌లను అందులో కూడా లాక్ చేయొచ్చు
ABN, Publish Date - Apr 01 , 2024 | 02:33 PM
వాట్సప్..(WhatsApp) వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యమిస్తూ.. రకరకాల ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పటికే లాక్ చాట్, ఎండ్ టు ఎండ్ ఎన్స్కిప్షన్ తదితర భద్రతాపరమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్.. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.
న్యూయార్క్: వాట్సప్..(WhatsApp) వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యమిస్తూ.. రకరకాల ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పటికే లాక్ చాట్, ఎండ్ టు ఎండ్ ఎన్స్కిప్షన్ తదితర భద్రతాపరమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్.. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇదివరకే వాట్సప్ ప్లాట్ ఫాంలో లాక్ చాట్ ఫీచర్‌ని పరిచయం చేసింది. ఎవరి చాట్‌నైనా దాచాలనుకున్నప్పుడు సదరు వాట్సప్ నంబర్‌ని లాక్‌లో పెట్టుకోవచ్చు.
తద్వారా అది డిస్ ప్లేపై కనిపించదు. దాని స్థానంలో లాక్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితేనే సదరు సీక్రెట్ లాక్ చాట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఇది స్మార్ట్ ఫోన్ డివైజ్‌లకే పరిమితమైంది. తాజాగా దీనికి కొనసాగింపుగా మరిన్ని డివైజ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
ఈ ఫీచర్‌తో వినియోగదారులు లింక్ చేసిన పరికరాలలో లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయడానికి సీక్రెట్ కోడ్‌ను సృష్టించవచ్చు. ఇది గోప్యత, వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. లాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్ ఇలా ఏ ఎలెక్ట్రానిక్ డివైజ్‌లోనైనా వాట్సప్‌తో లాగిన్ చేసి లాక్ స్క్రీన్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నందున అతి త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం.
అంతర్జాతీయ చెల్లింపులు సైతం..
గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వాట్సప్ యూపీఐ సాయంతో భారతీయ వినియోగదారులు అంతర్జాతీయ చెల్లింపులు కూడా చేయగలరు. వాట్సప్ ఈ ఫీచర్‌ని అభివృద్ధి చేస్తోంది.
దీంతో పాటు.. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లలో వేర్వేరు సైట్‌లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు ఆ బాధేమీ లేకుండా.. వాట్సప్‌లోనే డైరెక్ట్‌గా ఏఐ ఇమేజ్‌లను మనకి నచ్చినట్లు చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. ఇందుకోసం ఏఐ పవర్డ్ ఎడిటింగ్ టూల్‌ని డెవలప్ చేస్తోంది.
దీన్ని ఉపయోగించి ఏఐ ఇమేజ్‌లను నచ్చిన విధంగా అందంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏఐ సాయంతో ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్‌ని సవరించడం, రీస్టైల్ చేయడం సులభం కానుంది. దీనితో పాటు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సప్ కృషి చేస్తోంది.ఇకపై వినియోదారులు తమ ప్రశ్నలు, సందేహాలను మెటా ఏఐ(Meta AI) టూల్‌తో వాట్సప్‌లో అడగొచ్చు.
Katchatheevu:మోదీకి మాణికం సవాల్
ఇది చాట్ బాట్‌లాగా ఉపయోగపడుతుంది. Meta AI OpenAIకి చెందిన ChatGPTతో పోటీపడేలా రూపొందించారు. ఈ ఫీచర్లు ఇంకా డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. బీటా ఛానల్‌లోని టెస్టర్‌లతో సహా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫీచర్లు గనక అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడనుంది. వాట్సప్ తమ వినియోగదారుల మెరుగైన అనుభూతి కోసం ఇలా ఎన్నో ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 01 , 2024 | 02:33 PM