ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Whatsup: వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు

ABN, Publish Date - Mar 22 , 2024 | 05:35 PM

యూజర్స్‌కి మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ ఫీచర్ ద్వారా ఒకే సారి మూడు చాట్‌లను పిన్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.

ఇంటర్నెట్ డెస్క్: యూజర్స్‌కి మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ ఫీచర్ ద్వారా ఒకే సారి మూడు చాట్‌లను పిన్ చేసుకునే సదుపాయం కలుగుతుంది. ఇప్పటివరకు వినియోగదారులు వాట్సప్‌లో ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా అప్ డేట్‌తో గరిష్టంగా 3 చాట్‌లను పిన్ చేసుకోవచ్చు.

వాట్సప్ సంభాషణలో ముఖ్యమైన చాట్‌లను పిన్ చేసుకోవడం ద్వారా.. సందేశాలను వెతక్కుండానే ఈజీగా దొరుకుతుందని మెటా యాజమాన్యం వెల్లడించింది. ముఖ్యమైన చాట్‌లను కనుక్కోవడం, యాక్సెస్ చేయడం దీని ద్వారా సులభం అవుతుంది. ఈ ఫీచర్ రాబోయే కొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్, iOS, వెబ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వస్తుందని మెటా తెలిపింది. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

వాట్సప్‌లో సందేశాలను పిన్ చేయండిలా..

Androidలో...

1. వాట్సప్ ఓపెన్ చేసి సందేశాలను పిన్ చేయాలనుకుంటున్న చాట్‌కు వెళ్లండి.

2. మూడు చుక్కలపై (మరిన్ని ఎంపికలు) నొక్కండి. మెనులో "పిన్" అనే ఆప్షన్ ఎంచుకోండి.

3. సందేశాలను పిన్ చేయడానికి 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల వ్యవధిని ఎంచుకోండి.

4. నిర్ధారించడానికి పిన్ సింబల్‌ని మళ్లీ నొక్కండి.


iPhoneలో:

1. వాట్సప్ ఓపెన్ చేసి మెసేజ్‌ను పిన్ చేయాలనుకుంటున్న చాట్‌కు నావిగేట్ చేయండి.

2. కాంటాక్ట్ నంబర్ లేదా వాట్సప్ గ్రూపు పేరుపై నొక్కండి. ఆపై ఆప్షన్స్ నుంచి "పిన్ చాట్"ని ఎంచుకోండి.

3. మెసేజ్ పిన్ చేయడానికి 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల వ్యవధిని ఎంచుకోండి.

వెబ్/డెస్క్‌టాప్‌లో:

1. PCలో WhatsApp వెబ్ లేదా WhatsApp డెస్క్‌టాప్‌ను తెరవండి.

2. సందేశాన్ని పిన్ చేయాలనుకుంటున్న చాట్‌కి వెళ్లండి.

3. పిన్ చేయాలనుకుంటున్న సందేశాన్ని కనుగొని మూడు చుక్కలపై క్లిక్ చేయండి.

4. మెను నుంచి "పిన్" అనే ఆప్షన్‌తోపాటు వ్యవధిని ఎంచుకోండి.

Updated Date - Mar 22 , 2024 | 05:40 PM

Advertising
Advertising