ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్..ఏమిటో తెలుసా?

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:00 AM

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ల(new features)ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వాట్సాప్ నుంచి ఇతర యాప్‌లకు కూడా సందేశాలను పంపించుకోవచ్చు. దీంతో వాట్సాప్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా టెలిగ్రామ్ సహా ఇతర యాప్‌లకు సందేశాలను సులభంగా పంపుకోవచ్చు.

వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo వాట్సాప్ కొత్త ఫీచర్‌లను తీసుకువస్తోందని వెల్లడించింది. నివేదికల ప్రకారం వినియోగదారు కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి చాట్ ఇంటర్‌పెరాబిలిటీపై పనిచేస్తోందని పేర్కొంది. ఇది ఇతర యాప్‌లకు కూడా మద్దతునిస్తుందని EU రెగ్యులేటరీ ఏజెన్సీ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ (DMA)కి వాట్సాప్ తెలిపింది.


ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ బీటా(beta) వెర్షన్ 2.24.5.18లో ఉన్న చాట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు మెసేజింగ్ యాప్ ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసిన తాజా 2.24.5.20 బీటా వెర్షన్ వాట్సాప్ డెడికేటెడ్ చాట్ ఇన్ఫో స్క్రీన్ అనే ఆప్షన్‌ను అందిస్తుందని, ఇది థర్డ్ పార్టీ చాట్‌ల కోసం ఉంటుందని చెప్పింది. WABetaInfo ద్వారా భాగస్వామ్యం చేయబడిన స్క్రీన్‌షాట్ నుంచి ఈ సమాచారం అందుబాటులో ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Stock Market Updates: ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు

Updated Date - Mar 04 , 2024 | 11:00 AM

Advertising
Advertising