ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

X: 2 లక్షలకుపైగా భారత అకౌంట్లు తొలగించిన ఎక్స్.. ఎందుకంటే

ABN, Publish Date - Apr 14 , 2024 | 03:21 PM

ఎలాన్ మ‌స్క్‌(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్(X) భార‌త్‌లోని 2 ల‌క్ష‌ల మందికి పైగా యూజ‌ర్ల‌ అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ క‌ట్ట‌డిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.

ఢిల్లీ: ఎలాన్ మ‌స్క్‌(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్(X) భార‌త్‌లోని 2 ల‌క్ష‌ల మందికి పైగా యూజ‌ర్ల‌ అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ క‌ట్ట‌డిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1 వెయి 235 ఖాతాలను కూడా తొలగించినట్లు ఎక్స్ వెల్లడించింది. 2021 ఐటీ నిబంధన నెలవారీ నివేదికలో ఈ వివరాలు చెప్పుకొచ్చింది.


మొత్తంగా 2 లక్షల 13 వేల 862 ఖాతాలపై ఎక్స్‌ నిషేధం విధించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ వినియోగదారుల నుండి 5వేల 158 ఫిర్యాదులు అందాయి.

Former CM: మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలనుకొనేవారు గాల్లో కొట్టుకుపోతారు..

భారతీయ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువ నిషేధం ఎగవేత (3,074), ద్వేషపూరిత ప్రవర్తన (412), సున్నితమైన కంటెంట్ (953), దుర్వినియోగం/వేధింపులు (359) ఉన్నాయి. త‌మ గ్రీవెన్స్ రెడ్రెస‌ల్ మెకానిజం ద్వారా వీటన్నింటినీ కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్‌లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కూడా ఎక్స్ పరిష్కరించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 03:21 PM

Advertising
Advertising