ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తొక్కిసలాట కేసు..18కి చేరిన నిందితులు

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:00 AM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో నిందితుల సంఖ్య 18కి చేరింది.

ఏ18గా మైత్రీమూవీస్‌ నిర్మాతలు.. పరారీలో ఏడుగురు

కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అల్లు అర్జున్‌ విచారణ నివేదిక

హైదరాబాద్‌ సిటీ/చిక్కడపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో నిందితుల సంఖ్య 18కి చేరింది. ఇప్పటి వరకు 10 మంది అరెస్టవ్వగా.. తాజాగా ఆంటోనీ అనే బౌన్సర్‌ను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. నిందితుల్లో అసలు ఆ పేరుతో ఎవరూ లేరని పేర్కొంటూ.. ఇన్‌స్పెక్టర్‌ రాజూనాయక్‌ ఆ చిట్టాను విడుదల చేశారు. ఇదివరకు ఈ కేసులో అల్లు అర్జున్‌ సహా.. 16 మంది నిందితులుగా ఉండగా.. తాజాగా ఏ17గా అర్జున్‌ అంగరక్షకుడు ఫర్వాజ్‌, ఏ18గా మైత్రీమూవీస్‌ నిర్మాతలను చేర్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ ఇప్పటికే అరెస్టవ్వగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సంధ్య థియేటర్‌ భాగస్వాములు పెద్ద రామారెడ్డి, చిన్న రామారెడ్డి, సందీప్‌, మేనేజర్‌ నాగరాజు, బాల్కనీ ఇన్‌చార్జి విజయ్‌ చందర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోష్‌, అభిమానులను తరలించే ఫిరోజ్‌, బౌన్సర్లు అర్జున్‌, వినయ్‌ అరెస్టయ్యారు. వీరిలో పెద్ద రామారెడ్డి, చిన్న రామారెడ్డి బెయిల్‌పై బయటకు రాగా.. మిగతావారు జైలులోనే ఉన్నారు. కొందరు బౌన్సర్లతోపాటు.. అభిమానులను తరలించే వ్యక్తులు సహా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారిని గాలించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా.. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం మూడున్నర గంటల పాటు విచారించారు. ఆ సమయంలో అర్జున్‌ లాయర్‌ అశోక్‌రెడ్డి ఉన్నారు. అర్జున్‌ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణకు సంబంధించిన నివేదికను కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందజేయనున్నట్లు తెలిసింది.


నిందితులు వీరే

పెద్దరామిరెడ్డి(ఏ1), చిన్నరామిరెడ్డి(ఏ2), ఎం.సందీ్‌ప(ఏ3), సుమిత్‌(ఏ4).. థియేటర్‌ భాగస్వాములు-- ఆగమాటి వినయ్‌(ఏ5), అశుతోశ్‌రెడ్డి(ఏ6), రేణుకాదేవి(ఏ7), అరుణారెడ్డి(ఏ8), థియేటర్‌ మేనేజర్‌ నాగరాజు(ఏ9), బాల్కనీ ఇన్‌చార్జి విజయ్‌చందర్‌(ఏ10), అల్లు అర్జున్‌(ఏ11), అల్లు అర్జున్‌ పీఏ సంతో్‌ష(ఏ12), అల్లు అర్జున్‌ మేనేజర్‌ శరత్‌(13), అల్లు అర్జున్‌ సెక్యూరిటీ టీమ్‌-- రమేశ్‌(ఏ14), రాజు(ఏ15), ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు వినయ్‌కుమార్‌(ఏ16), బాడీగార్డ్‌ పర్వేజ్‌(ఏ17), మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు(ఏ18).

Updated Date - Dec 25 , 2024 | 04:00 AM