ఎన్‌కౌంటర్లలో భద్రాద్రి జిల్లా ఫస్ట్
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:23 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.
పదేళ్లలో 28 మంది మావోయిస్టుల మృతి.. ములుగు జిల్లాలో 17 మంది వరకు హతం
హైదరాబాద్, డిసెంబర్ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో భద్రు అలియాస్ పాపన్న.. మధు అలియాస్ మల్లయ్య తెలంగాణకు చెందిన వారు. మిగతా ఐదుగురు ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు. పాపన్న ఇల్లందు-నర్సంపేట ఏరియా కమాండర్‌గా ఉన్నారు. మల్లయ్య ఏటూరు నాగారం-మహదేవపూర్ డివిజన్ కార్యదర్శిగా ఉన్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమాండర్ లచ్చన్నతో పాటు ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో అత్యధికంగా భద్రాద్రి జిల్లాలోనే 28 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో 17 మంది వరకు మావోయిస్టులు మరణించారు. ఛత్తీ్‌సగఢ్‌లో పోలీసుల కూంబింగ్ ముమ్మరం కావడంతో మావోయిస్టులు తెలంగాణ వైపు కదులుతున్నారు.
Updated Date - Dec 03 , 2024 | 04:23 AM