ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan waiver: ఇదేం చోద్యం.. రుణం రూ.2 లక్షలు.. మాఫీ 3వేలా!

ABN, Publish Date - Jul 20 , 2024 | 12:11 PM

రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

మల్యాల: రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఓ రైతుకు 2 లక్షల రుణం ఉంటే మాఫీ ఉంటే కేవలం రూ.3 వేలే జమ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.


జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నల్ల నరసింహారెడ్డి అనే రైతుకు మల్యాల సింగిల్‌విండో పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌19 నాటికే రూ.2.25లక్షల పంట రుణం ఉంది. ఈ రైతుకు ప్రభుత్వం విడుదల చేసే మూడవ విడతలో రూ.2లక్షలు మాఫీ కావాల్సి ఉంది.

మొదటి విడత రూ.లక్ష రుణమాఫీ జాబితాలోనే రైతు పేరు రావడంతో జాబితా పరిశీలించాడు. ఇందులో రూ.3వేలు మాఫీ అయినట్లు వచ్చింది. ఈ చోద్యంపై రైతు నోరెళ్లబెట్టాడు. అధికారులు రూ.2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.


అర్హత ఉన్నా పేరు రాలే..

మరికొన్ని చోట్ల.. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్నా.. ఒకే బ్యాంకు ఖాతా ఉండి, రూ.లక్ష లోపే రుణం ఉన్నా మాఫీ జాబితాలో వారి పేరు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణం ఉండి, అంతా కలిపి రూ.లక్ష లోపు ఉండగా.. ఒక్కరి పేరుమీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయింది. మిగతా వారి పేరిట ఉన్న మొత్తం మాఫీ కాలేదు.

ఇలాంటి వారందరికీ సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ మొత్తం గందరగోళానికి జాబితాలను ముందుగా వెల్లడించకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రుణమాఫీ అమలుకు ముందే లబ్ధిదారుల జాబితాలను గ్రామాల్లో వెల్లడించి, అందరి ఖాతాల్లో ఒకటి రెండు రోజులు అటు ఇటుగానైనా సొమ్ము జమ అవుతుందన్న విషయాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అంటున్నారు. అయితే ఆగస్టులో రుణమాఫీ చేస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత వెంటనే అమలుకు ఉపక్రమించింది. తొలుత రూ.లక్ష రుణం మాఫీ చేస్తామంటూ ఒక్కరోజులోనే మార్గదర్శకాలు విడుదల చేసి.. ఆ మరుసటిరోజే మాఫీ ప్రారంభించింది. జాబితాలను నేరుగా బ్యాంకులకు పంపించింది. దీంతో జాబితాలను గ్రామాల్లో వెల్లడించే అవకాశంలేక.. లబ్ధిదారులెవరో తెలుసుకునే వీలులేకుండా పోయింది.

For Latest News and National News click here

Updated Date - Jul 20 , 2024 | 12:34 PM

Advertising
Advertising
<