ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Note for vote: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..

ABN, Publish Date - Aug 29 , 2024 | 12:17 PM

ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగదీష్ రెడ్డి దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని నియమిస్తామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.


కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్‌లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో కూడా వైఖరి మారిందని జగదీష్ రెడ్డి న్యాయవాది తెలిపారు. ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ని నియమించే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయి తెలిపారు.


పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణకు చెందిన తమ సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయి వెల్లడించారు. పిటిషన్‌పై విచారణను త్రిసభ్య ధర్మాసనం ముగించింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని సుప్రీంకోర్టు నియమిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Updated Date - Aug 29 , 2024 | 12:23 PM

Advertising
Advertising