Vemuri Radha Krishna: తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది
ABN, Publish Date - Nov 18 , 2024 | 07:03 PM
భవిష్యత్తులో తెలుగు భాష.. మృత భాషగా మారుతుందని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వేళ.. తెలుగు సాహిత్యం పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అందుకు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 18: తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసిందని ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష బతకాలంటే.. ప్రతి ఒక్కరు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో పోలవరపు కోటేశ్వరరావు రచించిన సాహిత్య సర్వస్వం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎండీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష.. మృత భాషగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వేళ.. తెలుగు సాహిత్యం పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అందుకు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనదంతా జాతుల సమూహమని.. ఆ క్రమంలో మనది తెలుగు జాతి అని ఈ సందర్భంగా రాధాకృష్ణ గుర్తు చేశారు. కానీ ఆ విషయాన్ని చాలా మంది విస్మరించారని తెలిపారు.
Also Read: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు
తెలుగు భాషను ఉద్దరించేందుకు సరైన ప్రయత్నం జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సాహిత్యం బతకాలంటే.. ముందు భాష బతకాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఏకీభవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భాష బతకాలంటే.. ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను ఒక పాఠ్యాంశంగా తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ఎండీ రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం
అలా అయితే తెలుగు భాష బతుకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు జాతి మనుగడ సైతం అద్భుతంగా ఉంటుందన్నారు. అలా చేయకుంటే మాత్రం తెలుగు భాష కచ్చితంగా మృత భాషగా మారుతుందన్నారు. దీంతో తెలుగు పుస్తకాలను సైతం పబ్లిషర్లు అప్పుడప్పుడు ప్రచరిస్తారని చమత్కరించారు. ఇక తెలుగు చదివే వాళ్లు సైతం ఉండరన్నారు. అలాగే రాసే వాళ్ల సంఖ్య సైతం దాదాపుగా తగ్గిపోతుందని చెప్పారు.
Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి
ఇక పోలవరపు కోటేశ్వరరావు రాసిన పుస్తకంలోని కథలను ఈ సందర్భంగా ఎండీ రాధాకృష్ణ ప్రస్తావించారు. ఈ కథలు గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉన్నాయన్నారు. అయితే ఇప్పటికే గ్రామాల్లో జీవితమే లేకుండా చేశారన్నారు. ఇక గ్రామాల్లో కూలీ నాలీ చేసుకునే వారు సైతం తెలుగు పదాలు వినియోగించడం లేదన్నారు. వారు సైతం వాటర్, రైస్ అంటూ చిన్న చిన్న పదాలను వాడుతున్నారని ఎండీ రాధాకృష్ణ సోదాహరణగా వివరించారు.
Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?
గ్రామీణుల జీవితాల్లోకి సైతం ఇంగ్లీషు భాషను తోసేశామన్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు ప్రతి ఒక్కరికి వస్తుందన్నారు. అయితే తామంతా ప్రభుత్వ పాఠశాల్లో విద్య అభ్యసించి.. ఈ స్థితిలో ఉన్నామని ఆయన చెప్పారు. పాఠశాలల్లో చదివిన వాళ్లు ఎవరు చెడిపోలేదన్నారు.
ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష విధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇదే వేదిక మీద ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఆయన సూచించారు. అలా అయితే తెలుగు భాష బతుకుతుందని ఓ ఆశ అని ఆయన చెప్పారు. ఇక తెలుగు భాష సేవకు తన పత్రిక, ఛానల్ సైతం పని చేస్తాయని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్పష్టం చేశారు.
For Telangana news And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 07:34 PM