రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:13 AM
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకట భూపాల్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.
రూ.4.19 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకట భూపాల్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆయనతోపాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇందులో రూ.4.19 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్టు లెక్కతేల్చి ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, నిషేధిత జాబితాలోని భూమిని తొలగించేందుకు రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఆగస్టు 14న ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగోల్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - Oct 23 , 2024 | 05:13 AM