ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Achampet : హమ్మయ్య.. వాళ్లను రక్షించారు

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:58 AM

చేపల వేటకు వెళ్లి నాలుగు రోజులుగా డిండి వాగులో చిక్కుకున్న చెంచులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరు నెలల పసికందు సహా పది మందిని సహాయక బృందాలు మంగళవారం సురక్షితంగా తీసుకొచ్చాయి.

  • చేపల వేటకు వెళ్లి డిండి వాగులో

  • చిక్కుకున్న చెంచులు సురక్షితం

  • ఆరు నెలల పసికందు సహా 10 మందిని కాపాడిన సహాయక బృందాలు

డిండి / అచ్చంపేట టౌన్‌, సెప్టెంబరు 3: చేపల వేటకు వెళ్లి నాలుగు రోజులుగా డిండి వాగులో చిక్కుకున్న చెంచులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరు నెలల పసికందు సహా పది మందిని సహాయక బృందాలు మంగళవారం సురక్షితంగా తీసుకొచ్చాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన జల్లా గురువయ్య, అతని కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ శివారులోని డిండి వాగు మధ్యలో దెయ్యంగుండ్ల బండపై తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని చేపలు వేటాడుతుంటారు. ఆరు నెలల పసికందు సహా మొత్తం పది మంది నాలుగు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లగా వరదలో చిక్కుకుపోయారు. ఎగువన కురిసిన వర్షాలకు డిండి రిజర్వాయర్‌ నుంచి దిగువకు నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో గురువయ్య కుటుంబం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాన్ని ఈ నెల 1న వరద చుట్టుముట్టింది. సోమవారం తెల్లవారేసరికి ఆ కుటుంబం ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. గురువయ్య కుటుంబాన్ని రక్షించేందుకు వెళ్లారు. కానీ, వరద ఉధృతంగా ఉండటం, చీకటి పడడంతో కాపాడలేకపోయాయి. అయితే, నల్లగొండ, నాగర్‌కర్నూలు జిల్లాల రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో అచ్చంపేట అగ్నిమాపక శాఖ బృందం మంగళవారం ఉదయం మరోమారు సహాయక చర్యలు చేపట్టింది. తాళ్ల సాయంతో మగవారిని, పుట్టిల్లో ఆరు నెలల పసికందు, ఇద్దరు మహిళలను సురక్షితంగా బయటికి తెచ్చింది. అనంతరం ఆ చెంచులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Sep 04 , 2024 | 04:58 AM

Advertising
Advertising