ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా గజ్జె పూజ మహోత్సవం

ABN, Publish Date - Oct 27 , 2024 | 10:25 PM

నస్పూర్‌ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శార్వాణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థులకు గురువు డాక్టర్‌ భార్గవిప్రేమ్‌ ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నస్పూర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శార్వాణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థులకు గురువు డాక్టర్‌ భార్గవిప్రేమ్‌ ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులకు వేద పండితుల సమక్ష్యంలో వైభవంగా పూజ నిర్వహించారు. అనంతరం 40 మంది విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.

సాంప్రదాయ వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యం చూపరులను అకట్టుకొంది. ఈ సందర్భంగా డాక్టర్‌ భార్గవిప్రేమ్‌ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళ కూచిపూడి నృత్యంలో ఎక్కువ మంది విద్యార్థులు శిక్షణను ఇవ్వడమే లక్ష్యమన్నారు. జిల్లా నృత్య సంఘం అధ్యక్షుడు రాకం సంతోష్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 10:25 PM