ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
ABN , Publish Date - May 08 , 2024 | 10:45 PM
జిల్లా కేంద్రంలో బుధవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం వృద్ధాశ్రమంలో పతాకాన్ని ఆవిష్కరించారు.

మంచిర్యాల కలెక్టరేట్, మే 8 : జిల్లా కేంద్రంలో బుధవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం వృద్ధాశ్రమంలో పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి వృద్ధులకు డాక్టర్‌లు తిరుమల్‌రావు, శ్రీధర్‌లు పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం రక్తనిధి కేంద్రంలో కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించి 30 మంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా శాఖ వైస్ చైర్మన్ సతీష్, కార్యదర్శి మహేందర్, సత్యపాల్‌రెడ్డి, కిషన్, శ్రీనివాస్, సత్యనారాయణరావు, సత్యనారాయణరెడ్డి, సంతోష్‌కుమార్, పాల్గొన్నారు.