Kumaram Bheem Asifabad: శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతర కృషి: ఎస్పీ
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:01 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాపోలీసు వార్షికనివేదిక 2024ను విడుదలచేశారు.
- జిల్లాలో ఈ ఏడాది 1207కేసులు నమోదు
- వార్షిక నివేదిక విడుదల చేసిన ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు
ఆసిఫాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాపోలీసు వార్షికనివేదిక 2024ను విడుదలచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ జిల్లాపరిధిలో ఈఏడాది 1207కేసులు నమోద య్యాయన్నారు. 2023లో జిల్లా పరిధిలో 1063కేసులు నమోదుకాగా ఈఏడాది 144కేసులు పెరిగాయన్నారు. ఈఏడాది జిల్లాలో 12హత్యకేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, మూడు నేరపూరిత హత్యలు, నాలుగు దొమ్మి కేసులు, 14కిడ్నాప్ కేసులు, 24రేప్‌కేసులు, 34ఎస్సీ, ఎస్టీ కేసులు, 27పోక్సో కేసులు, 39గంజాయి కేసులు, 21సైబర్‌నేరాల కేసులు, 188మహిళలపై అఘాయిత్యా లకు సంబంధించిన కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాది 22హత్యకేసులు, 109ఆస్తి సంబంధిత కేసులు, ఐదు నేరపూరిత హత్యలు, ఐదు దొమ్మికేసులు, 24 కిడ్నాప్ కేసులు, 27రేప్‌కేసులు, 24ఎస్సీ,ఎస్టీ కేసులు, 20పోక్సో కేసులు, 17గంజాయికేసులు, 26సైబర్ నేరాల కేసులు,177మహిళలపై అఘాయిత్యాలకు సంబంధిం చిన కేసులు నమోదయ్యాయన్నారు. గత సంవత్సరం తో పోల్చగా హత్యకేసులు 45.4శాతం, ఆస్తి సంబంధిత నేరాలు 24.7శాతం, నేరపూరిత హత్యలు 40శాతం తగ్గాయన్నారు. దొమ్మికేసులు 20శాతం, కిడ్నాప్ కేసులు 20శాతం, రేప్ కేసులు 11.1శాతం,సైబర్‌నేరాలు 32శాతం తగ్గాయన్నారు. ఎస్సీ,ఎస్టీ నేరాలు 41.6శాతం, పోక్సో కేసులు 35శాతం, మహిళలపై అఘాయిత్యాలు 6.2శాతం, గంజాయికేసులు 129.4శాతం పెరిగాయ న్నారు. జిల్లాలో ఈ ఏడాది 133 రోడ్డు ప్రమాదాల్లో 60 మంది మృతిచెందగా 91మంది గాయపడ్డారన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1.6శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఎస్సీ,ఎస్టీకేసులలో 34 కేసులు నమోదు కాగా బాధితులకు పరిహారం కోసం ఫైళ్లను కలెక్టర్‌కు పంపించామన్నారు. ఈఏడాది 82 ఆస్తి సంబంధిత నేరాల్లో రూ.62.08 లక్షలు విలువగల నగదు, ఆభరణా లు ఇతర వస్తువులు దొంగతనం కాగా 37కేసులనుగుర్తించి రూ.15.33 లక్షలను రికవరీ చేశామన్నారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది అన్నికేసులుకలిపి 48మందికి శిక్షలు పడ్డాయన్నారు. ఈ ఏడాది లోక్ అదాలత్‌లద్వారా 2378 కేసులను రాజీకుదిర్చామన్నా రు. పీడీఎస్ అక్రమరవాణాపై 100కేసులు నమోదు చేసి 170మందిని అరెస్టుచేసి 1221.8క్వింటాళ్ల బియ్యాన్నిసీజ్ చేశామన్నారు. గేమింగ్ యాక్టు, జూదం కింద 151 కేసుల్లో 605 మందిపై కేసులు నమోదుచేసి రూ.4.83లక్షలను సీజ్ చేశామన్నారు. జిల్లాలో 39 గంజాయి కేసులను నమోదుచేసి 65మందిని అరెస్టు చేసి 298.855కిలోల, 121 గంజాయి మొక్కలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. 45పశువుల ఆక్రమ రవాణా కేసులు నమోదుచేసి 130మంది నిందితులను అరెస్టు చేసి 628పశువులను రక్షించామన్నారు. జిల్లాలో 129 మంది బాలకార్మికులను పనులనుంచి విముక్తి చేశామ న్నారు. 1290డ్రంకన్ డ్రైవ్ కేసులలో 63,628 ఈచాలన్ల ద్వారా రూ.1.13కోట్ల జరిమానాలు విధించామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీప్రభాకర్‌రావు,డీఎస్పీలు కరుణా కర్, రామానుజం, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలి..
పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వ హించిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతికేసును క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా ఛేదించాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్‌క్రైం, డయల్100 వాటి వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవ గాహన కల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాల న్నారు. ప్రతిరోజు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహంచాలన్నారు. ఓవర్ స్పీడ్, ట్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపటం లాంటి వాటిపై ప్రత్యక దృష్టిపెట్టాలన్నారు. నూతన సంవ త్సరం వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమా వేశంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు కరుణాకర్, రామానుజన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:01 PM