ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఎగుమతి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:25 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 23(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు.

ఆసిఫాబాద్‌, డిసెంబరు 23(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఎగు మతుల సామర్థ్యం పెంపు అంశంపై అధి కారులు, పారిశ్రామికవేత్తలు, ఎస్పీఎం ప్రతి నిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్‌పేపరు మిల్లునుంచి సుమారు 1200టన్నుల కాగితం(రూ.7కోట్ల విలువ) ఉత్పత్తులు దుబాయి, ఒమన్‌ లాంటి దేశాలకు ఎగుమతిచేశామన్నారు. ఈ ప్రాంతం లో లభించే నాణ్యమైనపత్తి అధికంగా బంగ్లాదే శ్‌కి ఎగుమతి అవుతోందన్నారు. నాణ్యమైన బియ్యాన్ని పండించడం ద్వారా బంగ్లాదేశ్‌, ఉగాండ, మలేషియా, సింగపూర్‌ దేశాలలో మనదేశం ధాన్యానికి మంచిడిమాండ్‌ ఉంద న్నారు. తద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూ రుతోందన్నారు. ఈక్రమంలో పంటసాగుకు రైతులను ప్రొత్సహిస్తూ అధికదిగుబడి సాదిం చే విధంగా సన్నద్దం చేయాలన్నారు. వెదు రుతో తయారు చేసిన అలంకరణ వస్తువులు, చిరుధాన్యాలు, తేనేలాంటి ఉత్పత్తులకు జిల్లా అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యం లో నాణ్యమైన ఉత్పత్తుల ఉత్పాదకతను పెంచి ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించ వచ్చన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ ఎం అశోక్‌, డీఆర్‌డీవో దత్తరాం, ఏపీడీ రామకృష్ణ, మత్స్యశాఖ ఏడీ సాంబశివరావు, ఉద్యానవన అదికారి నదీం, సిర్పూర్‌పేపరు మిల్లు ప్రతినిధులు, రైసుమి ల్లుల, జిన్నింగ్‌ మిల్లుల యాజమానులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:25 PM