Kumaram Bheem Asifabad : ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:30 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు మాజీప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు మాజీప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో నాయకులు సతీష్ బాబు, బాలకృష్ణ, సంజీవ్, రాంబాబు, జయరాజ్, కార్తీక్, సాయి తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం మాజీప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ వాజ్‌పేయి దేశానికి ఎనలేని సేవలు చేసినట్టు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అంతా కృషిచేద్దామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశప్రధానిగా వాజ్‌పాయి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆయన ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెంచికలపేట: మండలకేంద్రంలో వాజ్‌పేయి శతజయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మధుకర్, రాజన్న, భుజంగరావు, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 11:30 PM