Kumaram Bheem Asifabad: గృహజ్యోతి వెలుగులు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:27 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుతన్న ఆరు గ్యారంటీల్లో ఒక్కటైన గృహజ్యోతి పథకం పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.
-ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 30,135 లబ్దిదారులకు రూ.72,58,757సబ్సిడీ
-సిర్పూరు నియోజకవర్గంలో 41,619 లబ్ధిదారులకు రూ.1,00,08,972సబ్సిడీ
-నిరుపేదలకు లబ్ధి
కాగజ్‌నగర్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుతన్న ఆరు గ్యారంటీల్లో ఒక్కటైన గృహజ్యోతి పథకం పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. జీరో బిల్లులు జారీ చేస్తుండటంతో బిల్లులు చెల్లించే అవసరం లేకుండా పోయింది. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 30,135లబ్ధిదారులకు రూ.72,58,757 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. సిర్పూరు నియోజకవర్గంలో 41,619లబ్ధిదారులకు రూ.1,00,08,972 సబ్సిడీ ప్రతినెలా అందుతోంది. జిల్లాలో నెలకు రూ.1,72,67,729 రాయితీని లబ్ధిదారులు పొందుతున్నారు. గృహజ్యోతికి జిల్లాలో 1,18,037 మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో అర్హులైన 73017మందిని ఎంపిక చేశారు. జీరో బిల్లింగ్ లబ్ధిదారుల్లో కూడా 200యూనిట్లు వరకు మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
ఇవీ పూర్తి వివరాలు..
గృహజ్యోతి పథకంలో ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో మండలాల వారీగా దరఖాస్తు దారులు వివరాలను పరిశీలిస్తే..
సిర్పూరు నియోజకవర్గంలో..
క్రమసంఖ్య సెక్షన్ దరఖాస్తులు అర్హులు జీరో బిల్లు మొత్తం రూ.
1. బెజ్జూరు 10776 7466 13,17,255
2. దహెగాం 7114 5453 10,50,966
3. కాగజ్/రూ 13313 8814 21,79,198
4. కాగజ్‌నగర్ 16154 7147 24,82,521
5. కౌటాల 12492 8233 21,23,387
6. సిర్పూరు(టి)6643 4506 8,55,645
=============================================
66,492 41,619 1,00,08,972
=============================================
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో..
క్రమసంఖ్య సెక్షన్ దరఖాస్తులు అర్హులు జీరో బిల్లు మొత్తం రూ.
1. ఆసిఫాబాద్ 8288 2929 9,78,992
2. ఆసిఫా/రూ 7578 5065 1,22,74,462
3. జైనూరు 5443 2780 7,83,672
4. కెరమెరి 4662 3041 6,67,427
5. రెబ్బెన 8738 5694 14,68,727
6. సిర్పూరు 4125 2249 3,15,820
7. తిర్యాణి 4740 3316 5,68,715
8. వాంకిడి 7971 5061 12,47,942
================================================
51545 30135 7258757
================================================
అర్హులను ఎంపిక చేశాం..
-సి.నాగరాజు, డీఈఈ
గృహజ్యోతి పథకంలో దరఖాస్తులు చేసిన వారికి పోర్టల్‌లో ఎంపికైన జాబితా ద్వారా 200 యూనిట్లలోపు ఉన్న వారికి ఉచితంగా జీరో బిల్లు అందజేస్తున్నాం. ఇప్పటివరకు 95శాతం పూర్తి అయింది. అందరికీ వర్తింపజేస్తున్నాం. నెలకు జిల్లాలో రూ.1,72,67,729 రాయితీ పొందుతున్నారు. ఇంకా దరఖాస్తులు చేసుకోని వారు ఉంటే ప్రభుత్వ పోర్టల్ తెరిచిన తర్వాత దరఖాస్తులు చేసుకోవచ్చు.
Updated Date - Dec 20 , 2024 | 11:27 PM