ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: సాదాబైనామాలపై ఆశలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:28 PM

భూములు కొనుగోలు చేసి తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకున్న వారి కష్టాలు గట్టెక్కనున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో ఎలాంటి పథకాలు పొందలేకపోయారు.

-పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం

-భూభారతితో ప్రభుత్వంపై పెరుగుతున్న ఆశలు

భూములు కొనుగోలు చేసి తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకున్న వారి కష్టాలు గట్టెక్కనున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో ఎలాంటి పథకాలు పొందలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా భూభారతి 2024చట్టం తీసుకొస్తోంది. దీనిద్వారా సదరు వ్యక్తులకు అన్నిరకాల హక్కులు లభించనున్నాయి.

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 23: సాదాబైనామా ప్రక్రియతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా భూభారతి 2024చట్టం అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో తెల్లకాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. నూతన ఆర్వోఆర్‌ చట్టంలో కొన్ని సవరణలు చేసి ఆ స్థానంలో భూభారతిని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. సులభతరంగా భూసమస్యలు పరిష్కరించుకునే విధంగా చట్టం తీసుకువస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా కాగితాలపై భూములు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కామయ్యే అవకాశాలున్నాయి.

ఏళ్లుగా ఎదురు చూపులు..

జిల్లావ్యాప్తంగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన వారికి గత ప్రభుత్వంలో చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లభిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేలపైగా దరఖాస్తులు ఉన్నట్లు అంచనా. తాజాగా ప్రవేశపెట్టిన భూభారతి బిల్లులో 2014జూన్‌2కు ముందు తెల్లకాగితాలపై కొనుగోలు చేసిన భూములన్నింటిని క్రమద్దీకరించేందుకు ఈ చట్టం సవరించారు. గతంలో ఈ సమస్యలన్నింటిపై దరఖాస్తులు స్వీకరించారు. ఏళ్లుగా వాటికి పరిష్కారం లభించకపోవడంతో రెవెన్యూకార్యాలయాల్లోనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. తాజాగా తెచ్చిన చట్టం ద్వారా వీటిని పరిష్కరించే అవకాశాలున్నాయి.

అన్నిరకాల సమస్యలకు పరిష్కారం..

భూభారతి చట్టం అమలులోకి వస్తే తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసిన వారికి భూ హక్కులు వర్తించనున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు చేసుకుంటున్నప్పటికీ రికార్డులో వారిపేర్లు లేవు. దీంతో వారికి ప్రభుత్వపథకాలు అందడం లేదు. రికార్డుల్లో భూమి ఉండి వారికి విక్రయించిన వారికి కూడా యాజమాన్య హక్కులు లేకుండాపోయాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో భూములు విక్రయించిన వారసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సంఘటనలు పోలీసు స్టేషన్‌ల వరకు వెళుతున్నాయి. అసలు పట్టాదారులకు సంబంధించిన వారసులు, సంబంధీకులు తెల్లకాగితాలు, బాండు పేపర్లపై భూములు కొనుగోలు చేసిన వారి నుంచి తిరిగి భూములు తీసుకోవడం లాంటి సమస్యలున్నాయి. ఇలా అనేకరకాల ఇబ్బందులు తలెత్తకుండా భూభారతి చట్టం ద్వారా వెసులు బాటు కలుగుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భూసమస్యల్లోని తీవ్రమైన సమస్యలకు పరిష్కారం కలుగనుంది.

ధరణిలో కనిపించని ఆప్షన్లతో ఇబ్బందులు..

గతప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి దాని ద్వారానే భూ నిర్వహణను కొనసాగించింది. అయితే ధరణిలో అన్నిరకాల ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాదాబైనామాలకు కూడా రైతులు, ఇతరులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆప్షన్లు లేకపోవడంతో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. చర్యలు తీసుకుంటామని అప్పటి ప్రభుత్వం కేవలం దరఖాస్తులు తీసుకొని అలాగే వదిలేసింది. కొత్త చట్టం పకడ్బందీగా అమలు చేస్తే భూ భారతితో మేలు కలుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:28 PM