Kumaram Bheem Asifabad: విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:27 PM
బెజ్జూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అందుగులగూడ గ్రామానికి చెందిన డీఎడ్ విద్యార్థిని తొర్రెం వెంకటలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
బెజ్జూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అందుగులగూడ గ్రామానికి చెందిన డీఎడ్ విద్యార్థిని తొర్రెం వెంకటలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయం కింద రూ.20వేల నగదు, ఒక క్వింటా బియ్యాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడతామన్నారు. ఆయనవెంట నాయకులు బషారత్‌ఖాన్, వెంకన్న, సకారాం, పుల్లూరి సతీష్, హన్మంతు, మహేష్, నరేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
గాయపడిన వ్యక్తికి పరామర్శ..
కౌటాల: మండలకేంద్రానికి చెందిన మువ్వ శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అతన్ని, కుటుంబ సభ్యులనుపరామర్శించారు. శ్రీకాంత్ కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితశిక్షణ తీసుకొని ప్రభుత్వ కొలు వు సాధించాడు. ఇటీవలఉద్యోగానికి వెళ్లుతున్న క్రమంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మాజీ ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, మాంతయ్య తదితరులున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 10:27 PM