Kumaram Bheem Asifabad: మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు: ఎస్‌ఈ
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:31 PM
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న వేసవికాలంలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటికే నుంచి ప్రణాళికబద్దంగా చర్యలు చేపడుతున్నట్లు ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్ శేషారావు తెలి పారు.
- ఆసిఫాబాద్ ఎస్‌ఈ ఆర్ శేషారావు
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న వేసవికాలంలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటికే నుంచి ప్రణాళికబద్దంగా చర్యలు చేపడుతున్నట్లు ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్ శేషారావు తెలి పారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవికాలం లో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్తగా నాలుగు పవర్‌ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుకు, 33/11 సబ్‌స్టేషన్‌లలో 4పవర్‌ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్థ్యాన్ని పెంచడానికి చర్య లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఈసుగాం 132కేవీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను ప్రతి టీజీఎన్‌పీడీసీఎల్ ఉద్యోగి కంకణబద్ధులై పని చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 11:31 PM