ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: పొగమంచు కాదు.. దుమ్ము

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:23 PM

కాగజ్‌నగర్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రధానరోడ్లతో పాటు ఎస్పీఎం పరిసరాల్లో నిత్యం దుమ్ము లేస్తోంది. దీంతో ద్విచక్రవాహనాలు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది.

-ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు

-పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రధానరోడ్లతో పాటు ఎస్పీఎం పరిసరాల్లో నిత్యం దుమ్ము లేస్తోంది. దీంతో ద్విచక్రవాహనాలు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. సర్‌సిల్క్‌ ప్రాంతం నుంచి ఎస్పీఎం గేటు వరకు ఏదైనా పెద్ద వాహనం వెళితే చాలు దుమ్ము లేస్తోంది. ఈ దుమ్మ తీవ్రత ఎంతగా ఉంటోందంటే కనీసం ఎదురుగా వచ్చే వాహనాన్ని కూడా గుర్తు పట్టలేనంతంగా ఉంటోంది. ఈ మార్గంలోనే పోలీస్‌స్టేషన్‌ ఉండటంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎస్పీఎం యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి వెంటనే రెండుపూటల ట్యాంకర్‌తో ఈ మార్గంలో నీటిని చల్లాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఎస్పీఎం మిల్లుకు కర్రలోడ్‌ తెచ్చేందుకు లారీలను గేటు ద్వారా లోనికి అనుమతిస్తారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలోనే వెళుతుండటంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే బస్టాండు నుంచి చెక్‌పోస్టు వరకు కూడా దుమ్ము లేస్తోంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆయా మార్గాల్లో దుమ్ము లేవకుండా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండు చేస్తున్నారు.

దుమ్మ విపరీతంగా లేస్తోంది..

-వెంగల నగేష్‌, సర్‌సిల్క్‌ కాగజ్‌నగర్‌

నేను సర్‌సిల్క్‌ కాలనీలో ఉంటాను. ఇక్కడి నుంచి మార్కెట్‌వెళ్లే క్రమంలో వాహనాలు వెళ్తునప్పుడు రోడ్డుపై అంతా దుమ్ము లేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనం ఏ మాత్రం కన్పించటం లేదు. అధికారులు స్పందించి ఈ మార్గంలో దుమ్ము లేవకుండా నిత్యం రెండు పూటల ట్రాక్టర్‌ ద్వారా నీటిని చల్లించాలి.

దుమ్ముతో అవస్థలు..

-సూర్యప్రకాష్‌, కాగజ్‌నగర్‌

ఎస్పీఎంకు కర్ర తెచ్చే లారీలతో నానా ఇబ్బందులు పడుతున్నాం. సర్‌సిల్క్‌ నుంచి ఎస్పీఎం గేటు వరకు, బాలభారతి నుంచి ఎస్పీఎం పాతగేటు వరకు లారీలు నిత్యం లోడ్‌తో వస్తుంటాయి. ఆ సమయంలో రోడ్డుపై ఏమీ కన్పించదు. దుమ్ము విపరీతంగా లేస్తుండడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Dec 22 , 2024 | 10:23 PM