Kumaram Bheem Asifabad: వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలి: కలెక్టర్
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:51 PM
వాంకిడి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
వాంకిడి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. శనివారం మండలకేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలురవసతి గృహం, వెనెకబడిన తరగతుల బాలుర వసతిగృహాలను ఆకస్మికంగా సందర్శించి వంటగదులు, విద్యార్థులు నిద్రించే గదులను పరిశీలించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ విద్యార్థులకు నూతన మోనూ ప్రకారం పోషకవిలువలు కలిగినఆహారాన్ని అందించాల న్నారు. సకాలంలో తాజాకూరగాయలు, నాణ్యతగల నిత్యావసర సరకులను వినియోగించాలన్నారు. కాలం చెల్లిన సామగ్రిని వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజన నాణ్య తను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులకు అదనంగా 10 మూత్ర శాలలు, శౌచాలయాలు నిర్మించేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహ సీల్దార్ రియాజ్‌అలి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వసతిగృహ సంక్షేమ అధికారులు, పాఠశాల హెచ్‌ఎం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 11:51 PM