Kumaram Bheem Asifabad: నేతల చూపు.. పల్లెల వైపు
ABN , Publish Date - May 09 , 2024 | 11:00 PM
వాంకిడి, మే 9: గ్రామీణప్రాంతాల్లో పోలింగ్‌శాతం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. అందువల్ల పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల పైనే దృష్టి సారిస్తున్నారు.

- ఉపాధి కూలీలే లక్ష్యంగా ప్రచారాలు
వాంకిడి, మే 9: గ్రామీణప్రాంతాల్లో పోలింగ్‌శాతం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. అందువల్ల పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల పైనే దృష్టి సారిస్తున్నారు. పల్లె ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిపార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. వారిని చైత న్యం చేస్తే తప్పకుండా తమకే ఓటువే స్తారనే నమ్మకంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పార్ల మెంట్ పరిధిలోని కుమరంభీం జిల్లాలో వివిధ పార్టీల ముఖ్యనాయకులు, కార్యక ర్తలు, పల్లెల్లోనే తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
- ఉపాధి కూలీలే లక్ష్యంగా..
గ్రామాల్లో ఉదయం, సాయంత్రం పార్టీ నాయకులు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 9గంటలవరకు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమ అభ్యర్థికి ఓటువేయాలని వేడుకుంటు న్నారు. ఉదయం మాత్రం ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకొని కూలీల వద్దకు వెళ్లి తమ పార్టీ గురించి చెబుతూ ఓట్లు తమ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఒకేచోట 200మంది కూలీలు ఉండడంతో నాయకులు ప్రచారం చేయడా నికి అనుకూలంగా ఉంటోంది. ఒక రోజు ఒకపార్టీ వారు వెళితే.. ఇంకోరోజు మరోపార్టీ వారు వెళ్తున్నారు. సుమారు గంటపాటు వారివద్దనే ఉంటూ తమపార్టీలు అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను కూలీలకు వివరిస్తు న్నారు.
- స్థానిక నాయకులు అన్ని తామై..
మూడు రోజుల్లో ప్రచారఘట్టం ముగి యనుంది. ఇంత తక్కువ వ్యవధిలో లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని గ్రామాల్లో అభ్యర్థులు పర్యటించడం సాధ్యం కాదు. అందుకే వారి అనుచరులు, పార్టీ ముఖ్య నాయకులు బంధువులు ఎక్కడిక్కడ ప్రచార బాధ్యతలను భుజానెత్తుకుంటు న్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ సభలు, కార్నర్‌సమావేశాలు, ర్యాలీలకు ప్రాధాన్యమి స్తుంటే ఆయాపార్టీల స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి ఓట ర్లను కలుస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా ఉదయం సాయంత్రం స్థానికనాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజలను కలుస్తూ పార్టీలు చేస్తున్న అభివృద్థి పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ప్రజలు తమ సంఘాలకు అవసరమైన వనరులను సమకూర్చాలని డిమాండ్‌చేస్తే వెంటనే జిల్లానాయకులకు సమాచారమిస్తూ సంఘాలకు అవసరమున్న వనరులను సమకూర్చేందుకు హామీలు ఇస్తున్నారు.