ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: గెలలు చేతికొచ్చాయి..

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:29 PM

బెజ్జూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడేళ్ల క్రితం నాటిన ఆయిల్‌ పామ్‌ మొక్కలు గెలలు వేసి నేడు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

- సంతోషంలో ఆయిల్‌ పామ్‌ రైతులు

- ఎవరికి విక్రయించాలోనన్న సందిగ్ధం

- కొనుగోలుపై దిగులు వద్దంటున్న అధికారులు

- ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలే కొంటాయంటున్న అధికారులు

బెజ్జూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడేళ్ల క్రితం నాటిన ఆయిల్‌ పామ్‌ మొక్కలు గెలలు వేసి నేడు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రైతులు మార్కెటింగ్‌ కోసం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలో రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తాయని అంటున్నారు. పంట చేతికొస్తుండ డంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2021-22లో ఆయిల్‌పామ్‌ సాగును రైతులు ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1450ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంట సాగు అవుతోంది. జనవరి తర్వాత మరో 250ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మూడు నెలల్లో దిగుబడి వచ్చే అవకాశం..

ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెల టన్ను ధర రూ.20,500ఉండటంతో సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు మరో మూడునెలల్లో దిగుబడులను ఇవ్వనున్నాయని ఉద్యానవనాధికారులు పేర్కొంటున్నారు.

మంచి ఆదాయం..

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం నుంచి 25నుంచి 30ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు. ఎకరానికి 12టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు రూ.20వేలు వచ్చినా పెట్టుబడులు పోను ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా నాలుగేళ్లపాటు అంతరపంటగా వివిధ రకాల పంటలను సాగు చేసుకోవచ్చు. సాగు చేసిన పంటను కంపెనీల వారే రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తారని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. మరో ఏడాది తర్వాత ప్రతి రెండు మండలాల పరిధిలో ఆయిల్‌పామ్‌ గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలో మహిక్స్‌ కంపెనీ వారు భీమిని, తాండూరు, రెబ్బెన ప్రాంతాల్లో ఏదో ఓచోట ప్యాక్టరీ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులు సాగు చేయడానికి మొక్కలు, రాయితీ, ప్రోత్సాహకాలు ఇస్తోంది. గుంతలు తవ్వడానికి, ఇతరత్రా పనులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేయడానికి ఒక్కో ఎకరాకు 50మొక్కలకు పైగా అవసరం ఉంటుంది. ఒక్కో మొక్కకు మార్కెట్‌లో రూ.193ఉండగా, ప్రభుత్వం రూ.173రాయితీ కల్పిస్తోంది. దీంతో రైతులు ఒక్కో మొక్కకు రూ.20చెల్లించాల్సి ఉంటుంది. బిందు సేద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 100శాతం రాయితీ, చిన్న,సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. సాగులో భాగంగా ఒకమొక్క నాటడం కోసం రెండడుగుల లోతు, వెడల్పుగా గుంతలు తవ్వాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడానికి రూ.100వరకు ఖర్చు అవుతుంది. 50గుంతలకు సుమారు 5000వరకు ఖర్చవుతుంది. అదేవిధంగా మొక్కల సంరక్షణకు ఎకరాకు రూ.2100, అంతరపంట సాగు కోసం ఎకరాకు రూ.2100 ఇస్తూ ఏడాదికిగాను రూ.4200 చెల్లిస్తుంది. ఇలా నాలుగేళ్ల వరకు రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. బిందుసేద్యం పరికరాలు అమర్చడం, ఎరువులు, మందులు, మొక్కల సంరక్షణ, నర్సరీల నుంచి మొక్కలకు అయ్యే ఖర్చులు, కలుపు తీయడం, ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వం సహకారం అందిస్తుంది.

ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు..

- అబ్దుల్‌ నదీమ్‌, జిల్లా ఉద్యానవన అధికారి, ఆసిఫాబాద్‌

రైతులు ఆయిల్‌పామ్‌ సాగుచేయడం ద్వారా అఽధికలాభాలు పొందవచ్చు. ఆయిల్‌పామ్‌ సాగుకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. కలుపు, ఇతర పనులు ఎక్కువగా ఉండదు. పంటనష్టం, కోతుల బెడద ఉండదు. ఆయిల్‌పామ్‌ సాగును ఒక్కసారి సాగుచేస్తే 30ఏళ్లవరకు ఆదాయం సమకూ రుతూనే ఉంటుంది. పంట సాగుకు నిరంతర విద్యుత్‌, నీటివసతి ఉంటే చాలు. జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ చేలల్లో 4961బోర్లు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేసినట్లయితే ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుంది. ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.

Updated Date - Dec 22 , 2024 | 10:29 PM