Kumaram Bhim Asifabad: అక్రమ వ్యాపారాలు చేస్తే కఠినచర్యలు తప్పవు: ఎస్పీ
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:25 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): అక్రమ వ్యాపారాలు చేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు అన్నారు.
- ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు
ఆసిఫాబాద్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): అక్రమ వ్యాపారాలు చేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లా డుతూ జిల్లాలో పీడీఎస్ బియ్యం, ఇసుక రవాణా, గుట్కా, గంజాయి లాంటి అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు అక్రమంగా గుట్కాలు విక్రయించిన 44కేసులో 59మందిని అరెస్టు చేశామని, రూ.38లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ రవా ణాకు సహకరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:25 PM