Kumaram Bhim Asifabad: లింగాపూర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది కొరత
ABN , Publish Date - Feb 10 , 2024 | 10:40 PM
లింగాపూర్, ఫిబ్రవరి 10: మండల కేంద్రంలోని ఆసుపత్రిలో సకలసౌకర్యాలు ఉన్నాయి. కానీ వైద్యం చేయడానికి వెద్యులు మాత్రం లేరు. ఇటీవల ప్రభుత్వం డాక్టర్లు, స్టాఫ్‌నర్సు లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, హెల్త్ అసిస్టెంట్‌ల డిప్యూటేషన్లు రద్దుచేస్తూ ఉతర్వు లు జారీచేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారువచ్చిన ప్రదేశాలకు వెళ్లారు.

- డిప్యుటేషన్ రద్దుతో యథాస్థానానికి వెళ్లిన సిబ్బంది
- ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు
లింగాపూర్, ఫిబ్రవరి 10: మండల కేంద్రంలోని ఆసుపత్రిలో సకలసౌకర్యాలు ఉన్నాయి. కానీ వైద్యం చేయడానికి వెద్యులు మాత్రం లేరు. ఇటీవల ప్రభుత్వం డాక్టర్లు, స్టాఫ్‌నర్సు లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, హెల్త్ అసిస్టెంట్‌ల డిప్యూటేషన్లు రద్దుచేస్తూ ఉతర్వు లు జారీచేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారువచ్చిన ప్రదేశాలకు వెళ్లారు. దీంతోమండలంలోగల ప్రభూత్వాసుపత్రి సిబ్బందిలేక వెలవెలబోతోంది. మండలప్రజ లకు వైద్యం అందించడానికి ఒక్కరు కుడా లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15వేల జనాభా కలిగిన మండలానికి ఏకైక ప్రభూత్వా సుపత్రికావడంతో ప్రజలుప్రభుత్వ వైద్యంపైనే అధారపడి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీపోస్టుల్లో వైద్యసిబ్బందిని భర్తీ చేయాలని మండలవాసులు కోరుతున్నారు.