నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, Publish Date - Oct 23 , 2024 | 10:40 PM
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునిల్ మాదిగ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నస్పూర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునిల్ మాదిగ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెవెళ్ళ డిక్లరేషన్ హమీలను నెరవేర్చాలన్నారు.
మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. లెదర్ పార్కులకు నిధులు కేటాయించాలని, డిసెంబరులోగా కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించాలన్నారు. ఎల్కంటి జనార్దన్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు కడారి రమేష్ మాదిగ, నాయకులు వడ్లకొండ సంజీవ్, అటకపురం సమ్మయ్య, కొప్పర్తి రాజం, పురుషోత్తం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 10:40 PM