Bapurao: కొందరు నేతలు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారు: సోయం బాపురావు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:16 PM
ఆదిలాబాద్: ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి చెందారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని, తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు.
ఆదిలాబాద్: ఎంపీ సోయం బాపురావు (MP Soyam Bapurao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి చెందారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని, తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు. ఇప్పటికీ అధిష్టానంపై నమ్మకం ఉందని.. టికెట్ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కమలనాథులు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నాలుగు స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహత్మంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మరోసారి బరిలోకి దింపుతోంది.
కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒకేసారి 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మొత్తం 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు తొలి జాబితాలో చోటు లభించింది. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి తిరిగి పోటీపడనున్నారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 195 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 51 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, గుజరాత్, రాజస్థాన్‌లలో 15 మంది చొప్పున, కేరళలో 12 మంది, తెలంగాణలో 9 మంది, అస్సాం, జార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్‌లలో 11 మంది చొప్పున, ఢిల్లీలో అయిదుగురు, ఉత్తరాఖండ్‌లో ముగ్గురు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇద్దరు చొప్పున, గోవా, త్రిపుర, డయ్యు డామన్, అండమాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను ఖరారు చేశారు. ఢిల్లీలో ఏకంగా నాలుగు స్థానాలలో సిటింగ్ అభ్యర్థులు రమేశ్ బిధౌరి, పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్‌లను పక్కనపెట్టి ఇతరులకు కేటాయించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ను కూడా పక్కనపెట్టారు. కాగా బీజేపీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌కు న్యూఢిల్లీ స్థానం నుంచి అవకాశం కల్పించారు. ఆమెకు ఇది తొలి ఎన్నికల సమరం. ప్రస్తుతం ఇక్కడ కేంద్రమంత్రి మీనాక్షిలేఖి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:18 PM