ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra Offers: కుర్రాళ్ల తెలివి అదుర్స్.. వంద కొట్టు.. మేకను పట్టు..

ABN, Publish Date - Oct 10 , 2024 | 01:27 PM

పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్‌, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో..

Dussehra Offer

దసరా వచ్చిందంటే చాలు.. ఆఫర్ల మీద ఆఫర్ల ఆకర్షిస్తుంటాయి. సాధారణంగా ఈ కామర్స్ సంస్థలు తమ సేల్స్ పెంచుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తుంది. అంతేకాదు.. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్‌, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా సీజన్‌లో కొన్ని గ్రామాల్లో స్పెషల్ లక్కీ డ్రా పేరుతో కొన్ని స్కీమ్‌లు పుట్టుకొచ్చాయి. కొందరు యువకులు కలిసి ఇలాంటి స్కీమ్స్‌ను తీసుకొస్తున్నారు. ప్రతి సామాన్యుడిని ఆకర్షించేలా స్కీమ్స్ ప్రవేశపెడుతున్నారు. దసరా పండుగంటే ప్రతి ఇంట్లో దాదాపు మటన్, మందుతో విందు ఉండనే ఉంటుంది. ప్రస్తుతం కిలో మటన్ రూ.800 నుంచి వెయ్యి వరకు పలుకుతోంది. మద్యం ధరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు యువకులు గ్రామాల్లో లక్కీ డ్రాలు ఏర్పాటుచేసి మొదటి పది మందికి బహుమతులంటూ స్కీమ్స్ తీసుకొచ్చారు. దసరాను దృష్టిలో పెట్టుకుని మటన్, మద్యం వంటి బహుమతులు గెలుచుకోవచ్చంటూ లాటరీ స్కీమ్‌లు తీసుకొచ్చారు.

Ratan Tata: వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..


వంద కొట్టు.. పొట్టేలు పట్టు..

ప్రస్తుతం ఒక పొట్టేలు కొనాలంటే సుమారు పది వేల రూపాయిల వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో రూ.100 కొట్టు పొట్టేలు పట్టు అంటూ లాటరీ స్కీమ్స్‌ గ్రామాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని గ్రామాలు, తండాల్లో రూ.50 చెల్లించి లాటరీ టికెట్ కొంటే మేకను గెలుచుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. ఒక లాటరీ టికెట్ ధరను రూ.100, రూ.50గా నిర్ణయించి.. గరిష్టంగా వెయ్యి మందికి మాత్రమే స్కీమ్‌లో అవకాశం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రకటనలు కరపత్రాల రూపంలో, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వెయ్యి మంది లాటరీ టికెట్లు కొంటే.. ఒక్కో టికెట్ రూ.100 చొప్పున లక్ష రూపాయిలవుతుంది. మొత్తం పది మందికి బహుమతులు ఇస్తామని చెప్పడంతో రూ.50 వేలు బహుమతలు కోసం ఖర్చయినా.. మరో రూ.50 వేలు నిర్వహకులకు మిగులుతుంది. దీంతో ఇదే మంచి ఛాన్స్ అంటూ గ్రామాల్లో ఈ లాటరీ స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్నారు. టికెట్ ధర రూ.100, రూ.50 కావడంతో జనం సైతం ఈ లాటరీ టికెట్లకు ఆకర్షితులవుతున్నారు. పోతే వంద గెలిస్తే పొట్టేలు.. ఆ అదృష్టం మనదేనేమో అనే ఆలోచనతో లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నారు. మంచిర్యాలలోని ఒక గ్రామంలో పెట్టిన లాటరీ స్కీమ్‌లో మొదటి బహుమతి ఫ్రిజ్, రెండో బహుమతి గొర్రెపొట్టేలు, మూడో బహుమతి మేకపోతేత, నాలుగో బహుమతి జానీవాకర్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి బ్లాక్‌డాగ్ ఫుల్ బాటిల్, ఆరో బహుమతి 100 పైపర్స్ ఫుల్ బాటిల్, ఏడవ బహుమతి కింగ్ ఫిషర్ లైట్ కాటన్ బీర్లు, ఎనిమిదో బహుమతి నాటుకోడి పుంజు, 9వ బహుమతి నాటుకోడి పెట్ట, 10వ బహుమతి బాయిలర్ కోడిగా నిర్వహకులు ప్రకటించారు.

Ratan Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా కన్నుమూత


ప్రభుత్వం నిషేధించినా..

వాస్తవానికి లాటరీ స్కీమ్స్ పేరిట గతంలో భారీ మోసాలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం లాటరీ విధానాన్ని నిషేధించిందని పోలీసులు హెచ్చరిస్తున్నా.. బంపర్ ఆఫర్ పేరుతో లాటరీ పథకాలు పుడుతూనే ఉన్నాయి. వెయ్యి మంది లాటరీ టికెట్లు కొంటే పది మందికి మాత్రమే బహుమతులు వస్తాయి. మిగతా 990 మంది నష్టపోవాల్సి వస్తుంది. దీంతో బహుమతులు గెలుచుకోని వ్యక్తులు తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో లాటరీలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం లాటరీ టికెట్లు కొనేందుకు బారులు తీరుతున్నారు.

Ratan Tata: రతన్ టాటా చివరి పోస్టు ఇదే.. కన్నీరు పెడుతున్న నెటిజన్లు..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 10 , 2024 | 01:27 PM