విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచడమే లక్ష్యం
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:30 PM
విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యమని విద్యశాఖ అధికారులు అన్నారు. తీగల్ పహాడ్‌లోని మండల పరిషత్ పాఠశాలలో రూమ్‌టురీడ్ ఇండియా ట్రస్ట్ యుఎస్‌ఏఐడీ సహకారం, ఎస్‌ఇఆర్‌ఐ, ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అనుబందంగా విద్యాశాఖ సమన్వయంతో మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.
నస్పూర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యమని విద్యశాఖ అధికారులు అన్నారు. తీగల్ పహాడ్‌లోని మండల పరిషత్ పాఠశాలలో రూమ్‌టురీడ్ ఇండియా ట్రస్ట్ యుఎస్‌ఏఐడీ సహకారం, ఎస్‌ఇఆర్‌ఐ, ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అనుబందంగా విద్యాశాఖ సమన్వయంతో మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. శనివారం సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, మండల విద్యాధికారి రామన్నలతో కలిసి స్కూల్ కాంప్లెక్ ప్రధానోపాధ్యాయడు దామోదర్ ప్రారంభించారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో చదవడం అలవాటు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్టు ప్రతి మండలానికి మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తోందన్నారు. లైబ్రరీలో వివిధ రకాల కథలతో కూడిన పుస్తకాలు, పిల్లల ఆలోచన పరిధిని పెంచుతాయన్నారు. పుస్తకాలు చదవడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, రూమ్‌టురీడ్ కో అర్డినేటర్ కోట గీత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ సంధ్య, ఉపాధ్యాయులు లీలావతి, అలివేలు మంగ, అఖిల పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 11:30 PM