పంటల డిజిటల్ సర్వేకు ఏఈవోలు ఓకే!
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:19 AM
ఎట్టకేలకు పంటల డిజిటల్ సర్వేలో పాల్గొనేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) సుముఖత వ్యక్తం చేశారు. గురువారం నుంచి సర్వే చేసేందుకు అంగీకారం తెలిపారు. సర్వే విషయంలో కొంతకాలంగా వ్యవసాయశాఖ, ఏఈవోల మధ్య వివాదం నడుస్తోంది.
వ్యవసాయ శాఖ జరిపిన చర్చలు సఫలం
ఎట్టకేలకు పంటల డిజిటల్ సర్వేలో పాల్గొనేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) సుముఖత వ్యక్తం చేశారు. గురువారం నుంచి సర్వే చేసేందుకు అంగీకారం తెలిపారు. సర్వే విషయంలో కొంతకాలంగా వ్యవసాయశాఖ, ఏఈవోల మధ్య వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో రైతుబీమా పోర్టల్‌లో మరణాల నమోదులో అలస్యం చేసినందుకుగాను వ్యవసాయశాఖ 160మంది ఏఈవోలను మంగళవారం సస్పెండ్ చేసింది.
ఈ రెండు అంశాలపై చర్చించేందుకు బుధవారం వ్యవసాయశాఖ డైరక్టర్ కార్యాలయంలో ఏఈవోల సంఘంతో పాటు, రాష్ట్రస్థాయి గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవోలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శాఖ డైరెక్టర్ గోపికి అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డైరెక్టర్ గోపి హామీ ఇవ్వడంతో సర్వేలో పాల్గొనేందుకు ఏఈవోలు అంగీకరించారు.
Updated Date - Oct 24 , 2024 | 03:19 AM