మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం

ABN, Publish Date - Mar 01 , 2024 | 05:08 PM

నగరంలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఓ విమానం ల్యాండింగ్‌ (Plane Landing) సంక్లిష్టంగా మారింది. దీంతో బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) పరిసరాల్లో దాదాపు అరగంట నుంచి ఓ విమానం చక్కర్లు కొడుతోంది.

 Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం

హైదరాబాద్: నగరంలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఓ విమానం ల్యాండింగ్‌ (Plane Landing) సంక్లిష్టంగా మారింది. అయితే దాదాపు అరగంట ఉత్కంఠ తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) పరిసరాల్లో దాదాపు అరగంటపాటు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian AirLines) విమానానికి ఈ పరిస్థితి ఎదురైంది. విమానం పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసి చివరికి విజయవంతమయ్యారు. కాగా ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా టైర్లలో ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఫ్లైట్ ల్యాండింగ్‌ విషయంలో కొద్దిసేపు ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated Date - Mar 01 , 2024 | 05:47 PM

Advertising
Advertising