ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం

ABN, Publish Date - Jun 21 , 2024 | 01:50 PM

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు.

హైదరాబాద్: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని.. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు తీరుతాయని భట్టి విక్రమార్క అన్నారు.


సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరమని భట్టి తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలన్నారు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలనన్నారు. గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ గనులను సింగరేణికు కేటాయించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Jun 21 , 2024 | 01:50 PM

Advertising
Advertising