Sridhar Babu: రాష్ట్రంలో అంబర్ రెసోజెట్ పరిశ్రమలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:20 AM
పలు దిగ్గజ కంపెనీలకు ఎలకా్ట్రనిక్ పరికరాలు, విడిభాగాలను సరఫరా చేసే ‘అంబర్-రెసోజెట్’ సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
250 కోట్లతో ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల ప్లాంట్లు
మూడేళ్లలో స్థాపన.. వెయ్యి మందికి ఉపాధి
శ్రీధర్‌బాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పలు దిగ్గజ కంపెనీలకు ఎలకా్ట్రనిక్ పరికరాలు, విడిభాగాలను సరఫరా చేసే ‘అంబర్-రెసోజెట్’ సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కంపెనీ వచ్చే మూడేళ్లలో తమ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. దీని వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. త్వరలోనే తెలంగాణలో అధునాతన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పరిశ్రమను నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
అంబర్-రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండీషనర్ల వంటి పలు పరికరాలను ఉత్పత్తి చేసి అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, డిఫెన్స్ వాహనాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన ఎయిర్ కండీషనర్ల తయారీలో అంబర్ ఎంటర్‌ప్రైజె్‌సకు మంచి పేరుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ కంపెనీ హైదరాబాద్‌లో ప్లాంట్లను పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని శ్రీధర్ బాబు అన్నారు.
Updated Date - Nov 26 , 2024 | 03:20 AM