ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Danam Nagender: ఆంధ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీవా? కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా?

ABN, Publish Date - Sep 13 , 2024 | 11:49 AM

ఎమ్మెల్యే గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్లారు. ఆంధ్ర వాళ్ళ ఓట్లు, డబ్బులు మాత్రమే బీఆర్ఎస్‌కు కావాలని.. అక్కడి వారితో వ్యాపారాలు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్యే గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్లారు. ఆంధ్ర వాళ్ళ ఓట్లు, డబ్బులు మాత్రమే బీఆర్ఎస్‌కు కావాలని.. అక్కడి వారితో వ్యాపారాలు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఆంధ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీవా? వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తిగతమైతే కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. గతంలో మహిళా గవర్నర్ ను కించపరిచిన చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉందన్నారు. గాజులు వేసుకునే మహిళల శక్తి ఏంటో కౌశిక్ రెడ్డికి చూపిస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిన పీఏసీ పదవిని గతంలో అక్బరుద్దీన్‌కు ఎందుకిచ్చారని దానం నాగేందర్ ప్రశ్నించారు. మేము జవాబు చెబితే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేరన్నారు. ఇవన్నీ చేసుకుంటూనే ఇక్కడ వరకూ వచ్చామని అన్నారు.


కౌశిక్ రెడ్డి బచ్చా అని దానం నాగేందర్ విమర్శించారు. హరీష్ రావు అంటే తనకు గౌరవమని... ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారన్నారు. మరికాసేపట్లో శంభీపూర్ నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజు బయలుదేరునున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. కాసేపట్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఇంటికి మైనంపల్లి హనుమంతరావు సైతం వెళ్లనున్నారు. ఇప్పటికే గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారు. అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు మా ఇంటికొస్తే సాదర స్వాగతం పలుకుతానని పేర్కొన్నారు. కూర్చుని బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మాట్లాడుకుంటామన్నారు. తనను ఆంధ్రోడన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్‌కు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.


కౌశిక్ రెడ్డి బతకటానికి వచ్చినట్లే.. తాను కూడా హైదరాబాద్ వచ్చానన్నారు. తనకు‌.. కౌశిక్ రెడ్డితో పోలికనా? అని ప్రశ్నించారు. తన క్రమశిక్షణ హరీష్ రావుకు తెలుసని పేర్కొన్నారు. తనను బీఆర్ఎస్ పార్టీలో చేర్చించిందే హరీష్ రావు అని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. గతంలో పీఏసీ పదవి కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుకు కాకుండా.. అక్బరుద్దీన్ కు ఎందుకిచ్చారని అరికెపూడి గాంధీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సూచించిన వారికే పీఏసీ పదవి ఇవ్వాలని ఏమీ లేదన్నారు. కౌశిక్ రెడ్డి పదే పదే తనను రెచ్చగొట్టటం వల‌నే స్పందించాల్సి వచ్చిందన్నారు. పిల్లిని గదిలో బంధించి కొడితే.. పిల్లి కూడా తిరగబడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి నాశనం పట్టించాడని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్వయంగా సభాపతి ప్రకటించారని అరికెపూడి గాంధీ అన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:50 AM

Advertising
Advertising