Phone Tapping Case: ప్రణీత్ రావ్ వ్యవహరంలో మరో బిగ్ ట్విస్ట్
ABN, Publish Date - Mar 19 , 2024 | 05:04 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్‌ను ప్రణీత్ రావు విన్నట్టు తేలింది. సాధారణంగా ఎస్‌ఐబీలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అందుకోసం నోడల్ అధికారి ఒక లింక్‌ను ఎస్ఐబీ వారికి ఇస్తారు. కానీ అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్‌ను ప్రణీత్ రావు విన్నట్టు తేలింది. సాధారణంగా ఎస్‌ఐబీలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అందుకోసం నోడల్ అధికారి ఒక లింక్‌ను ఎస్ఐబీ వారికి ఇస్తారు. కానీ అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీ లో ఉన్న కొన్ని కంప్యూటర్లలో ఈ మాల్వేర్‌ను ప్రణీత్ రావు, అతడి టీమ్ ఇన్‌స్టాల్ చేశారు. కొత్త మాల్‌వేర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అయితే ఈ కొత్త మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లను కంప్యూటర్ల నుంచి ప్రణీత్ రావు తొలగించాడు. మాల్వేర్ నుంచి విన్న కాల్ రికార్డింగ్స్‌ను హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లలోకి ఎక్కించాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజున వాటన్నింటినీ ధ్వంసం చేసినట్టు అధికారులు గుర్తించారు.
Updated Date - Mar 19 , 2024 | 05:05 PM