ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫోర్త్‌ సిటీలో ఫ్యాషన్‌ వర్సిటీ

ABN, Publish Date - Oct 23 , 2024 | 03:16 AM

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇప్పుడు ఫోర్త్‌ సిటీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అదే.. ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ! 20 ఎకరాలు కేటాయిస్తే దీనిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

  • 20 ఎకరాల్లో ఏర్పాటుకు యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ సుముఖం

  • సియోల్‌లో సంస్థ చైర్మన్‌ కిహాక్‌ సంగ్‌తో

  • మంత్రులు పొంగులేటి, పొన్నం చర్చలు

  • టెక్స్‌టైల్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయి

  • మార్పులకు అనుగుణంగా స్థాపన

  • కేఎంటీపీలో వచ్చే ఏడాది మరో 4 యూనిట్లు

  • వరంగల్‌ విమానాశ్రయం ప్రారంభమైతే

  • మరింత పారిశ్రామికాభివృద్ధి: కిహాక్‌

  • ఏడాదిన్నరలో అందుబాటులోకి: మంత్రులు

(సియోల్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇప్పుడు ఫోర్త్‌ సిటీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అదే.. ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ! 20 ఎకరాలు కేటాయిస్తే దీనిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి స్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సియోల్‌ పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం మంగళవారం అక్కడి యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. కంపెనీ చైర్మన్‌ కిహాక్‌ సంగ్‌తో మంత్రులు పొంగులేటి, పొన్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీపై ఆయన ఆసక్తి చూపించారు. టెక్స్‌టైల్‌ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఈ వర్సిటీ ఉంటుందని, తద్వారా, హైదరాబాద్‌ కేంద్రంగా భారత వస్త్ర పరిశ్రమ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని కిహాక్‌ సంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రులు.. ఫోర్త్‌ సిటీలో 20 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫోర్త్‌ సిటీ భూ వినియోగంపై త్వరలో కొత్త ల్యాండ్‌ పాలసీని ప్రకటించనున్నామని, దానికి అనుగుణంగా భూ కేటాయింపు ఉంటుందని తెలిపారు.


  • మార్చిలోపు మరో నాలుగు యూనిట్లు

టెక్స్‌టైల్‌ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ వస్త్ర తయారీ కంపెనీగా యంగ్‌ వన్‌కు పేరుంది. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ (కేఎంటీపీ)లో ఈ సంస్థకు ఇప్పటికే ప్రభుత్వం 298 ఎకరాలు కేటాయించగా.. ఇందులో ఒక యూనిట్‌ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. ఇక్కడ తయారవుతున్న ట్రెక్కింగ్‌ స్పోర్ట్స్‌వేర్‌ టీ షర్టులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. రూ.840 కోట్లతో మొత్తం 11 యూనిట్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా యూనిట్ల ప్రారంభం గురించి సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు. దీంతో, వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తామని కిహాక్‌ సంగ్‌ చెప్పారు. మిగతా యూనిట్లను ఆ తర్వాత ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌ కేంద్రంగా కేఎంటీపీ నుంచి ఉత్పత్తి అవుతున్న తమ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లు వస్తే వ్యాపారం మరింత పెరుగుతుందని తెలిపారు. వరంగల్‌ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే తమకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని, పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.

దీనికి స్పందించిన మంత్రులు.. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఏడాదిన్నరలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. కొత్త యూనిట్ల శంకుస్థాపనకు తెలంగాణకు రావాలని మంత్రులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కేఎంటీపీ కొత్త యూనిట్ల ప్రారంభానికి త్వరలో యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తన కుమార్తె రే యున్‌ సంగ్‌ వస్తారని కిహాక్‌ మంత్రులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కార్పొరేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు. తమ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ చేనేత కార్మికులు రూపొందించే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి పట్టుచీరను బహుమతిగా ఇస్తామని మంత్రులు సరదాగా వ్యాఖ్యానించారు. తెలంగాణ చేనేత కార్మికుల సృజనాత్మకత గురించి కాబోయే చైర్మన్‌కు మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 03:18 AM