ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: విగ్రహారాధనపై ద్వేషంతో దుశ్చర్య

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:46 AM

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • ముత్యాలమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన వ్యక్తి అరెస్టు

  • ముంబైకి చెందిన సల్మాన్‌గా గుర్తింపు.. మునావర్‌ జమా ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో ‘మత విద్వేష సదస్సు’కు హాజరు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ముంబైకి చెందిన సల్మాన్‌ సలీమ్‌ ఠాగూర్‌ అలియాస్‌ సల్మాన్‌ (30)గా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే దు రుద్దేశంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సదస్సుకు సల్మాన్‌ హాజరయ్యాడని, ఈ క్రమంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ సదస్సుకు 151 మంది వచ్చారని, వారికి నిర్వాహకులు హోటల్లో వసతి కల్పించారని పోలీసుల విచారణలో తేలింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి తాళం పగులగొట్టాడు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. గుడిపైకి చేరుకొని పైన ఉన్న విగ్రహాన్ని పగులగొట్టటానికి యత్నించాడు. స్థానికుడు ఒకరు గమనించి ఆగంతకుడ్ని పట్టుకున్నాడు. ఈలోపు మరికొందరు స్థానికులు చేరుకొని ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. స్థానిక మార్కెట్‌ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత విచారణ చేయగా అతను ముంబైకి చెందినవాడని, పేరు సల్మాన్‌, బీఈ (కంప్యూటర్స్‌) గ్రాడ్యుయేట్‌ అని తేలింది.


సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సల్మాన్‌ దేశం నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకున్న జకీర్‌ నాయక్‌, ఇతర ఇస్లామిక్‌ మతబోధకుల వీడియోలు చూసి ప్రభావితమయ్యాడు. హిందూ మతం, ఆచార వ్యవహారాలు, విగ్రహారాధనపై ద్వేషం పెంచుకుని ఉద్రేకానికి లోనయ్యేవాడు. ఈ క్రమంలోనే 2022లో ముంబై ఆరే సబ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గణేశ్‌ మండపంలోకి పాదరక్షలతో ప్రవేశించాడు. విగ్రహారాధనను అపహాస్యం చేసి, అక్కడి వ్యక్తులతో వాదనకు దిగాడు. దాంతో అతనిపై కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో శ్రీమనోకామన సిద్ధి మహదేవ్‌ మందిరంలోకి ప్రవేశించి శంకరభగవానుడి విగ్రహాన్ని కాలితో ధ్వంసం చేసి, హిందూ మత విశ్వాసాలను అవమానించాడు. దాంతో మిరా భాయీందర్‌ వసాయి విరార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.


  • నగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే సదస్సు..

సికింద్రాబాద్‌ మెట్రోపాలిస్‌ హోటల్లో ఈ నెల 1 నుంచి 31 వరకు మునావర్‌ జమా అనే వక్త (మోటివేషనల్‌ స్పీకర్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత విద్వేషాలను రెచ్చగొట్టే సదస్సుకు సల్మాన్‌ హాజరైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 151 మంది మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 49 గదుల్లో వారికి బస ఏర్పాటు చేసినట్లు తేలింది. దీంతో గోపాలపురం పోలీసులు మునావర్‌ జమా తో పాటు హోటల్‌ యజమాని అబ్దుల్‌ రషీద్‌ బషీ ర్‌ అహ్మద్‌, మేనేజర్‌ రెహ్మాన్‌పై కేసు నమోదు చేశారు. మునావర్‌ జమా మతం పేరుతో వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నాడని, ముస్లింలను రెచ్చగొడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్‌ను కూడా ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వం సం చేయడానికి రెచ్చగొట్టాడని తెలిపారు. మునావర్‌ జమా సంగతి తెలిసి కూడా హోటల్‌ యజమాని, మేనేజర్‌ సదస్సు నిర్వహించేందుకు అతనికి సహకరించారన్నారు. వ్యక్తిత్వ వికాసం ముసుగులో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 17 , 2024 | 03:46 AM