ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నేడు 3 బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం

ABN, Publish Date - Aug 01 , 2024 | 10:44 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2వ వార్షిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టేబుల్ చేయనున్నారు. ఈ రోజు మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లు.. తెలంగాణ లా డిపార్ట్మెంట్ ( చేంజ్ ఆఫ్ ఆక్రోనేమ్స్) బిల్లు, తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు- 2 లను సభలో ప్రభుత్వం పెట్టనుంది.


రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమం చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదా? అని నిలదీశారు. సభను తప్పుదారి పట్టించే విధంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించారన్నారు. వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని సబితకు తెలియదా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్ర మహిళలను అగౌరపరిచినట్లుగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తోందన్నారు. ప్రతీ మహిళలను ఇందిరమ్మలా కాంగ్రెస్ చూస్తోందన్నారు. గతంలో కేసీఆర్‌ను విమర్శించిన విషయాన్ని సబిత మర్చిపోయారా అని ప్రశ్నించారు. మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు.


మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అవమానపరిచారని.. కాబట్టి వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేటి శాసనసభ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభలో కింద కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 11:10 AM

Advertising
Advertising
<