ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో దారుణం

ABN, Publish Date - Jul 02 , 2024 | 01:45 PM

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో దారుణం చోటు చేసుకుంది. వివాహమై మూడు నెలలు కాకముందే భర్త ప్రవీణ్ వేధింపులకు తెరదీశాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక మూడు అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి మహిళ కిందికి దూకింది. వివాహం జరిగినప్పటి నుంచి తనను వేధింపులకు గురవుతున్నట్టుగా తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది.

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో దారుణం చోటు చేసుకుంది. వివాహమై మూడు నెలలు కాకముందే భర్త ప్రవీణ్ వేధింపులకు తెరదీశాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక మూడు అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి మహిళ కిందికి దూకింది. వివాహం జరిగినప్పటి నుంచి తనను వేధింపులకు గురవుతున్నట్టుగా తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. వేధింపులు భరించలేక తల్లిదండ్రుల ఇంటికి సదరు మహిళ వెళ్లింది. కుటుంబ సభ్యులు నచ్చచెప్పి తిరిగి అత్తారింటికి పంపారు.


తిరిగి భర్త ప్రవీణ్ దగ్గరకు వచ్చాక వేధింపులు తగ్గకపోగా మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో వేధింపులు తట్టుకోలేక మూడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. బిల్డింగ్ నుంచి దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకున్నారు. గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 01:45 PM

Advertising
Advertising